Chilli Crop : మిరప సాగులో పోషకాల యాజమాన్యంలో మెళుకువలు..!

మిరప పంట( Chilli crop )ను సాగు చేసే రైతులు ముందుగా సాగు విధానంపై అవగాహన కల్పించుకుని, కొన్ని మెళుకువలు పాటిస్తూ సాగు చేస్తే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.మిరప నారు కొనడం కంటే పొలంలో ఆరోగ్యకరమైన నారును పెంచి, ప్రధాన పొలంలో నాటుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

 Techniques In Management Of Nutrients In Chili Cultivation-TeluguStop.com
Telugu Agriculture, Cattle Manure, Chili, Chilli Crop, Chilli, Farmers, Yields-L

నారు పెంచేందుకు నేలపై కొంచెం ఎత్తులో మట్టి బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి.ఈ బెడ్ల నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.ఇక నారుమడిలో విత్తనాల మధ్య కనీసం ఒక అంగుళం దూరం ఉండేలా విత్తనాలు చల్లుకోవాలి.నారు మొక్కలకు అధిక ఎండ తగలకుండా కాస్త నీడ ఉండేలా వస్త్రాన్ని ఒక టెంటు లాగా పైన వేసుకోవాలి.35 నుంచి 40 రోజుల మధ్య ఉండే ఆరోగ్యకరమైన మిరప నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

Telugu Agriculture, Cattle Manure, Chili, Chilli Crop, Chilli, Farmers, Yields-L

మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు( Yields ) ఇవ్వాలంటే పోషకాల యాజమాన్యం అత్యంత కీలకము.మిరప పంట సాగు చేసే నేలలో పోషకాల శాతాన్ని పెంచేందుకు ముందుగా పచ్చిరొట్ట ఫైర్లను వేయాలి.పచ్చిరొట్ట పైర్ల వల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి.

పచ్చిరొట్ట పైర్లు పూత దశకు వచ్చే సమయంలో ట్రాక్టర్ కల్టివేటర్ తో నేల మెత్తగా అయ్యేవరకు దుక్కి దున్నాలి.ఒకవేళ పచ్చి రొట్ట పైర్లు వేయడానికి అవకాశం లేకపోతే పశువుల ఎరువు( Cattle manure )కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రధాన పొలంలో మిరపనారు నాటిన 25 రోజుల లోపు ఒక ఎకరాకు 100 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ ఎరువులు అందించాలి.మొక్క ఎదుగుదలను బట్టి నత్రజని ఎరువులను అందిస్తుండాలి.

పూత, కాయ నాణ్యత కోసం పోటాష్ ఎరువులను రెండు లేదా మూడుసార్లు అందించాలి.వర్షాలు అధికం అయితే మొక్కలు తమ కావాల్సిన పోషకాలను నేల నుంచి పొందలేవు.వర్షాలు అధికంగా కురుస్తున్న సమయాలలో 19.19.19 ఎరువును 8 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మిరప మొక్కలపై పిచికారి చేయాలి.పొలంలో కలుపు సమస్య ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా చీడపీడల, తెగుళ్ల బెడద ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube