ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ హై కమాండ్ పెద్దల నిర్ణయం ఏమిటి అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇటీవల పొత్తు విషయమై చర్చలు జరిపి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ప్రస్తుతం ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు.
బిజెపి మాత్రం తొందరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, అంత కంగారు ఏముంది అంటూ ప్రకటనలు చేస్తోంది.బిజెపి వ్యవహారం అటు టిడిపి, ఇటు జనసేన పార్టీలకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
బిజెపితో పొత్తు ఉంటే రాజకీయంగా తమకు కలిసి వస్తుందని, కేంద్రంలోనూ తమకు ఇబ్బందులు ఉండవని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.ఏపీలో బిజెపి ప్రభావం అంతంత మాత్రమే అయినా, కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే అప్పుడు బిజెపి అవసరం తమకు అవసరమని భావిస్తూ, ముందుగానే ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
కానీ బిజెపి మాత్రం తమ వైఖరి ఏమిటనేది క్లారిటీ ఇవ్వడం లేదు.ఇప్పటి వరకు బిజెపి కోసమే అన్నట్లుగా జనసేన, టిడిపి( Janasena, TDP ) అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా వేస్తూ వచ్చారు.
కానీ ఈరోజు మొదటి విడత జాబితాను రెండు పార్టీలు విడుదల చేయబోతున్నాయి.బిజెపి పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలను మినహాయించి బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి.ఇది ఇలా ఉంటే బిజెపి మాత్రం పొత్తు పెట్టుకుంటాము అన్నట్లుగానే సంకేతాలు ఇస్తుంది.కానీ ఒంటరిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, జనసేన, టిడిపి లకు అంతుపట్టడం లేదు.
ఇది ఇలా ఉంటే ఏపీలో సీట్ల సర్దుబాటు, టిడిపి జనసేనతో చర్చించకుండానే ఏపీలో బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవడం వంటివి మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి.ఈనెల 27న ఏలూరులో ప్రజా పోరు( Praja poru yatra ) పేరుతో బిజెపి బహిరంగ సభ నిర్వహిస్తోంది.
బిజెపి( BJP ) ఒంటరిగా బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.దీంతో ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయా లేదా అనేది అనుమానంగా మారింది.ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు పొత్తుపై చర్చలు జరిపి చాలా రోజులైనా, బిజెపి మాత్రం ఉద్దేశపూర్వకంగానే తమ నిర్ణయం ఏంటి అనేది బయటకు వెల్లడించకుండా టీడీపీ, జనసేనలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.