పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా అప్పట్లో వరుస సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.ఆయన మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి కూడా మెగాస్టార్ తో సంబంధం లేకుండా తను కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రస్తుతం పవర్ స్టార్( Power Star ) అంటే ఇండియా మొత్తం సుపరిచితమే.ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సినిమాలను మాత్రం ఎప్పుడూ వదలడం లేదు.
అవకాశం వచ్చిన ప్రతిసారి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక సినిమాల్లో వచ్చిన డబ్బులతోనే తను పాలిటిక్స్ లో నిలువగలుగుతున్నాడు అని చెబుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమా( Suswagatham ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర కోసం మొదటగా శోభన్ బాబుని( Sobhan Babu ) తీసుకోవాలని అనుకున్నారు.కానీ ఆయన ఈ పాత్రని రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో రఘువరన్( Raghuvaran ) నటించాడు.ఇక ఈ సినిమా వచ్చే సమయానికి శోభన్ బాబు హీరోగా ఆయన కెరియర్ అనేది బాగా డౌన్ అయిపోయింది.
తన సమకాలీన నటులు అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తుంటే శోభన్ బాబు మాత్రం హీరో పాత్రలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఈ సందర్భంలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు శోభన్ బాబుతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నాడు.కానీ ఆయన శోభన్ బాబుని అడిగితే తను ఆ పాత్ర లో నటించలేనని చెప్పి రిజెక్ట్ చేశాడు…ఇలా శోభన్ బాబు కనుక ఆ పాత్ర చేసి ఉంటే ఆ పాత్ర కి ఇంకా వెయిట్ పెరిగేదని చాలా మంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు…
.







