లోక్సభ సీట్ల( Lok Sabha seats ) వ్యవహారంపై సీపీఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో సీపీఐకి ఒక్క లోక్సభ సీటు అయినా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
తాము మొత్తం ఐదు పార్లమెంట్ స్థానాలను సూచించామన్నారు.
ఈ క్రమంలో ఒక్క సీటు అయినా ఇవ్వకపోతే ఎన్నికల్లో పొత్తు కుదరదని ఆ పార్టీ నేత నారాయణ( CPI leader Narayana ) తెలిపారు.తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందన్న ఆయన ఒక్క సీటు అయినా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.ఇప్పటికే కలిసి ఉన్నాం కదా అని కాంగ్రెస్( Congress ) లైట్ తీసుకోవద్దని చెప్పారు.
ఈ క్రమంలోనే కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే అధికార కాంగ్రెస్ కు మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్న ఐదు స్థానాల్లో ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్ మరియు పెద్దపల్లి స్థానాలను సూచించామని.
వీటిలో ఏదైనా ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.