పూనమ్ కౌర్( Poonam Kaur ) పరిచయం అవసరం లేని పేరు ఈమె సినిమాలలో నటించి పాపులర్ అయిన దానికంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు వివాదానికి కారణం అవుతూ ఉంటాయి.
ఈమె ఎవరి గురించి పోస్ట్ చేస్తుంది అనే విషయాలు తెలియకుండా పరోక్షంగా పోస్టులు చేస్తూ అందరిని అయోమయానికి గురి చేస్తూ ఉంటారు.
ఇలా పరోక్షంగా ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) త్రివిక్రమ్( Trivikram ) వంటి వారిని ఉద్దేశించి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు అయితే ఇప్పటివరకు ఈమె పరోక్షంగా పోస్టులు చేసి అందరినీ కన్ఫ్యూజన్ కి గురి చేసిన తాజాగా మాత్రం డైరెక్ట్ గా త్రివిక్రమ్ పై చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇదివరకు గురూజీ అంటూనే తనపై సైటర్లు వేసే పూనమ్ తాజాగా ఏకంగా త్రివిక్రమ్ పేరును కూడా ప్రస్తావనకు తీసుకువచ్చింది.
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం మనకు తెలిసిందే.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ జగన్( Jagan ) సిద్ధం అంటున్నారు మనం యుద్ధం అంటున్నాం నాకు పంచ్ డైలాగ్ చెప్పడం ఇష్టం లేదు కానీ అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) సినిమాలో సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అనే డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాను కానీ త్రివిక్రమ్ చేసేదేమీ లేక కామెడీగా చెప్పించారు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై పూనమ్ స్పందిస్తూ యూస్ లెస్ ఫెలో అంటూ హ్యాష్ ట్యాగ్ తో త్రివిక్రమ్ పేరు జోడించింది.
దీంతో గతంలో కూడా ఈమె త్రిక్రమును ఉద్దేశించే అలాంటి వివాదాస్పద పోస్టులు చేశారంట పలువురు కామెంట్లు చేస్తున్నారు.