ఏపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం.
ఎంపీ వేమిరెడ్డి బాటలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్( Roopkumar Yadav ) తో పాటు మరికొందరు నేతలు నడవనున్నారని ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం ఆయన రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే గత కొన్ని రోజులుగా నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి విషయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీ( TDP ) తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది.







