ఒక సినిమా తీయడానికి దర్శకులు, నిర్మాతలు చాలా కష్టపడాలి.అలాగే తీసిన సినిమాను విడుదల చేయడానికి కూడా అంతకన్నా కష్టపడాల్సిన రోజులు ఒకప్పుడు ఉండేవి.
ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత ఆ శ్రమ కాస్త తగ్గింది.థియేటర్లో విడుదల చేయడానికి కష్టాలు ఉంటే తీసుకెళ్లి ఏదో ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ లో వేస్తున్నారు.
కానీ ఒకప్పుడు అలా ఉండేవి కాదు సినిమా రిలీజ్ చేయడం అంటే కత్తి మీద సాముల ఉండేది.అలా సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదలకు నోచుకోని కొన్ని సినిమాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శాంతి నివాసం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాధవి హీరోయిన్ గా నటించిన సినిమా శాంతి నివాసం( Shanti Nivasam ) ఈ చిత్రానికి బాబు అనే వ్యక్తి దర్శకత్వం వహించాడు.షూటింగ్ మొత్తం పూర్తయినా కూడా ఈ సినిమా విడుదల కాలేదు.ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ కూడా కన్నుమూయడంతో చిత్రం విడుదల కాకుండా ఆగిపోయింది.
ఇంటింటా అన్నమయ్య

ఎంత పెద్ద దర్శకుడైన హీరో అయినా కూడా సినిమా విడుదల చేయడం అనేది ఎంత కష్టమో ఈ చిత్రం గురించి చెబితే అర్థం అయిపోతుంది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఇంటింటా అన్నమయ్య( Intinta Annamayya ) అనే సినిమా పదేళ్ల క్రితం విడుదల కావాల్సింది.కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ ఇప్పటి వరకు విడుదల మాత్రం జరగలేదు.
బీమా

విక్రమ్, త్రిష హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా పేరు భీమా.( Bheema ) ఈ చిత్రం తమిళ్ లో విడుదలైన తెలుగులో మాత్రం ఇప్పటికి విడుదల కాలేదు.లింగస్వామి దీనికి దర్శకత్వం వహించాడు.
డీకే బోసు

సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటించిన సినిమా పేరు డీకే బోసు.( DK Bose ) ఇది కూడా దాదాపు 10 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తిచేసుకుని ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.
కోతి కొమ్మచ్చి

శ్రీహరి తనయుడు మేఘాంష్ హీరోగా కోతి కొమ్మచ్చి( Kothi Kommachi ) అనే సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించారు.కానీ ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని మూడేళ్లు గడిచిన విడుదలకు మాత్రం అడ్డంకులు ఏంటో తెలియడం లేదు.
జాదు

హీరో రవి కృష్ణ 7/జి బృందావన్ కాలనీ తో ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు.అయితే తమన్నా, ఇలియానా హీరోయిన్స్ గా రవి కృష్ణ హీరోగా నటించిన సినిమా 2007లో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావలసి ఉండగా ఇప్పటికీ ఆ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నారు.
దట్ ఇజ్ మహాలక్ష్మి

తమన్నా మెయిన్ లీడ్ లో నటించిన సినిమా దటీజ్ మహాలక్ష్మి.( That Is Mahalakshmi ) ఈ షూటింగ్ పూర్తి అయ్యి దాదాపు నాలుగేళ్ల సమయం అయింది.అయినా కూడా ఇంత వరకు రిలీజ్ కి నోచుకోవడం లేదు.
అయినా ఇష్టం నువ్వు

నరేష్ కుమారుడు నవీన్ అలాగే మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం అయినా ఇష్టం నువ్వు.( Inaa Ishtam Nuvvu ) ఈ సినిమా ఎనిమిదేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుంది.కానీ విడుదల మాత్రం ఆగిపోయింది.కీర్తి సురేష్ నటించిన మొట్టమొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
నా పేరు శివ సీక్వెల్

కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.అయితే పా రంజిత్ కార్తి కాంబినేషన్లోనే మద్రాసి అనేవి సినిమా తీసి దానికి నా పేరు శివ సీక్వల్ గా( Naa Peru Shiva Sequel ) విడుదల చేయిస్తున్నామంటూ మూడేళ్ల క్రితం ప్రకటించారు .కానీ ఆ సినిమా ఎందుకో విడుదల ఆగిపోయింది.







