తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ లక్ష్మీణ్ ( MP Laxman )కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ( BJP ) అధిష్టానం దిశానిర్దేశం చేసిందని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో 370 కి పైగా స్థానాలను బీజేపీ గెలుస్తుందన్నారు.
దేశంలో మూడో సారి కూడా మోదీనే ( Modi )ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికల ముందే కాంగ్రెస్( Congress ) చేతులేత్తేసిందని విమర్శించారు.దేశంలో మోదీ కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
ఆర్థిక దేశంగా భారత్ మారుతుందన్న ఆయన.ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తెలిపారు.