టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇకపోతే మొదట నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం( NTR Dual Role ) చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.తారక్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది.కానీ ఇప్పటివరకు టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా టీమ్ విడుదల చేసిన పోస్టర్( Devara Poster ) ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు కొత్త పోస్టర్‌లో టైటిల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతోపాటు సినిమాకి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టేలా ఉండటం విశేషం.దేవర` టైటిల్‌లోనే అసలు కథ కనిపిస్తుంది.
ప్రారంభంలో దేవర టైటిల్ ప్లెయిన్‌గా ఉంది.కానీ నిన్న కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో ఓ రహస్యాన్ని బయటపెట్టారు.

టైటిల్‌లో దేవర మూవీలో వర రెడ్ కలర్‌తో ఉంది.అంతేకాదు ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా కొత్తగా ఉంది.ఇందులో యంగ్‌గా కనిపిస్తున్నాడు.గతంnలో విడుదల చేసిన లుక్‌లో ఎన్టీఆర్ పెద్దగా కనిపించాడు.ఇదే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెడుతుంది.అయితే ప్రారంభంలో వచ్చిన ఎన్టీఆర్ లుక్ తండ్రి పాత్రకి సంబంధించినది అని, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన లుక్ కొడుకు పాత్రకి సంబంధించినదిగా తెలుస్తుంది.
తండ్రి దేవరగా కనిపిస్తే, కొడుకు వర పాత్రలో కనిపిస్తాడని అర్థమవుతుంది.సముద్రపు పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుందట.
ఇందులో తండ్రి పాత్ర పోర్ట్ ని నిర్మిస్తుందని, దాన్ని ప్రత్యర్థుల నుంచి, అక్కడ అక్రమాలు జరగకుండా చూసే పాత్రలో దేవర పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.