ఓపెన్ఏఐ సంస్థ( Open AI ) అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ను తయారు చేస్తూ చాలామందిని ఆకట్టుకుంటుంది.ఇటీవల సోరా అనే కొత్త ఏఐ టూల్ను అభివృద్ధి చేసింది.
సోరా ఏఐ మోడల్ టెక్స్ట్ టైప్ చేస్తే చాలు వీడియోలను క్రియేట్ చేసి ఇస్తుంది.ఉదాహరణకు, మీరు “బంతితో ఆడుకునే కుక్క” అని టెక్స్ట్ టైప్ చేసి ఎంటర్ చేయగానే, ఒక కుక్క, ఒక బంతిని క్రియేట్ చేసి, కుక్క బంతితో ఆడుకుంటున్నట్లు ఓ వీడియో సీన్ క్రియేట్ చేస్తుంది.
ఈ వీడియో హై గ్రాఫిక్స్, హై క్వాలిటీతో అద్భుతంగా కనిపిస్తుంది.సోరా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలను క్రియేట్ చేయగలదు.
టెక్స్ట్ రూపంలో ఏం అడిగారో దానికి మ్యాచ్ అయ్యేలా ఇది వీడియోలను తయారు చేయగలదు.

సోరా( Sora AI ) ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.ఓపెన్ఏఐ ఈ ఏఐ మోడల్లోని సమస్యల కోసం పరీక్షిస్తోంది.సోరా తప్పుడు, ద్వేషపూరిత లేదా అన్యాయమైన వీడియోలను రూపొందించవచ్చు.
ఒకవేళ ఈ సమస్యలను పరిష్కరించకుండా విడుదల చేస్తే చాలామందికి ఇబ్బందులు ఎదురవుతాయి.అందుకే ఓపెన్ఏఐ సోరా సురక్షితంగా, ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఉండాలని నిర్ధారించుకోవాలనుకుంటోంది.
ఇటీవల ఓపెన్ఏఐ బాస్ సామ్ ఆల్ట్మాన్ సోరా ఏం చేయగలదో ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించాలన్నారు.వీడియోల కోసం తనకు టెక్స్ట్ పంపమని ఇంటర్నెట్లోని వ్యక్తులను అతను కోరాడు.
ప్రజలు ఏమైనా రాసుకోవచ్చా? అని ప్రశ్నించారు.

సోరా ఎలాంటి వివరాలనైనా వీడియో రూపంలో సృష్టించగలదని ఆల్ట్మాన్ బదులు ఇచ్చారు.ప్రజలు అతనికి వీడియోల కోసం చాలా వింత మెసేజ్లు పంపారు.“జంతువులతో నీటిపై బైక్ల రేసు” వీడియో కావాలని ఒక వ్యక్తి అడిగాడు.
ఆల్ట్మాన్ సోరాను ఉపయోగించి ఆ టెక్స్ట్ నుంచి ఓ వీడియో( Video )ను రూపొందించారు.ఆ వీడియో చాలా వాస్తవంగా కనిపించింది, టెక్స్ట్తో మ్యాచ్ అయింది.వీడియోలో మనం జంతువులు నీటిపై సైకిల్ రేస్ లో పాల్గొనడం చూడవచ్చు.ప్రస్తుతం ఆ ఏఐ జనరేటెడ్ క్లప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిని మీరూ చూసేయండి.







