సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలోని 10వ వార్డు పరిధిలో గోవిందపురం వెళ్లే మూల మలుపు వద్ద గాంధీ పార్క్ సెంటర్ లో మాన్యువల్ మూత పగిలి ప్రమాదకరంగా మారిందని సామజిక కార్యకర్త ఆకుల రాము అన్నారు.శనివారం హుజూర్ నగర్ లో ఆయన మాట్లాడుతూ ఈ మాన్యువల్ మూత పగిలి చాలాకాలం అవుతుందని, ఈ రోడ్డు నుండి సింగారం, గోవిందపురం వెళ్ళే ద్విచక్ర వాహనదారులతో, శివాలయం,అమ్మవారి ఆలయాలకు వెళ్లే భక్తులచే నిత్యం రద్దీ ఉండే ప్రాంతం కావటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
సంబంధిత అధికారులు, పాలకమండలి వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించి,ప్రమాదాల బారిన పడకుండా ప్రజల్ని కాపాడాలని కోరారు.