సాధారణంగా సినిమా హీరోలు కొన్ని విషయాల్లో ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు.అచ్చొచ్చిన తేదీలు కొన్ని ఉంటాయి అని నమ్ముతూ ఉంటారు.
ఆయా తేదీలలో సినిమాలు విడుదల చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని అనుకుంటూ ఉంటారు.ఇక ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఇలాంటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు అన్నది తెలుస్తుంది.
తమకు బాగా అచ్చొచ్చిన తేదీల్లోనే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ తమ సినిమాలను విడుదల చేయడానికి రెడీ అయిపోతున్నారని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.
ఈ ముగ్గురు హీరోలు ఏ సినిమాలు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.సరిగ్గా 34 ఏళ్ల క్రితం 1988లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యముడికి మొగుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా విడుదలై సెన్సేషన్ సృష్టించింది.
ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.ఒకప్పుడు యముడికి మొగుడు సినిమా లాగానే ఆచార్య సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు.
లోకనాయకుడు కమల్ హాసన్ విషయానికి వస్తే కమల్ హాసన్ కెరియర్లో ఎప్పుడూ గుర్తుండిపోయే ప్రేక్షకులను మెప్పించిన చిత్రం సాగరసంగమం. ఈ సినిమా 1983లో విడుదలైన సూపర్ హిట్ అయింది.జూన్ 3వ తేదీన ఈ సినిమా విడుదలైంది.అయితే ఇక ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమాను కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ జూన్ 3వ తేదీన విడుదల చేయాలని కమలహాసన్ డిసైడ్ అయ్యాడు అన్నది తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ కెరీర్ను కీలక మలుపు తిప్పి స్టార్ హీరోను చేసిన అర్జున్ రెడ్డి సినిమా 2017లో ఆగస్టు 25వ తేదీన విడుదల అయింది.ఇక ఇప్పుడు లైగర్ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయాలని రౌడీ హీరో కూడా రెడీ అయిపోయాడు.