Venu Swamy Pawan Kalyan : నేను పవన్ అభిమానిని.. జల్సా మూవీకి పేపర్లు చింపాను.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి( Astrologer Venu Swamy ) సోషల్ మీడియాలో ఏ సెలబ్రిటీ గురించి కామెంట్ చేసినా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.పవన్ కళ్యాణ్ కు ఎవరూ సలహాలు ఇవ్వలేరని పవన్ సినిమాలలో 10 సినిమాలకు నేను మూహూర్తం పెట్టానని వేణుస్వామి వెల్లడించారు.

 Venuswamy Comments About Pawan Kalyan Details Here Goes Viral In Social Media-TeluguStop.com

పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నేను కోరుకుంటానని ఆయన అన్నారు.నేను కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ఫ్యాన్ అని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను థియేటర్ లో చూసి పేపర్లు చించిన వ్యక్తులలో నేను కూడా ఒకడినని వేణుస్వామి వెల్లడించారు.పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు సులువు కాదని రజనీకాంత్ పొలిటికల్ లైఫ్( Rajinikanth Political Life ) ఎలా ఉందో పవన్ లైఫ్ కూడా అలాగే ఉందని వేణుస్వామి కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ లైఫ్ లో వివాదాలు ఉన్నాయని ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Ap, Astrologervenu, Astrology, Jalsa, Janasena, Pawan Kalyan, Rajinikanth

వేణుస్వామి చెప్పిన జాతకాలలో కొన్ని విషయాలు నిజమైతే కొన్ని మాత్రం నిజం కాలేదు.2024 ఎన్నికలకు సంబంధించి వేణుస్వామి చెప్పిన విషయాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan Politics ) గురించి వేణుస్వామి పాజిటివ్ గా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

పవన్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

Telugu Ap, Astrologervenu, Astrology, Jalsa, Janasena, Pawan Kalyan, Rajinikanth

పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే ఎన్నికల తర్వాత థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

పవన్ రెమ్యునరేషన్( Pawan Kalyan Remuneration ) సైతం భారీ రేంజ్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube