Boyapati Srinu : యంగ్ హీరోలకు హ్యాండ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు స్టార్ హీరోలందరికీ సక్సెస్ లని ఇస్తున్నారు.కానీ యంగ్ హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నారు.

 Boyapati Srinu : యంగ్ హీరోలకు హ్యాండ్ ఇచ-TeluguStop.com

అలాంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు.ఈయన సీనియర్ స్టార్ హీరోలకి భారీ సక్సెస్ లను అందించాడు.

కానీ యంగ్ హీరోలు అయిన రామ్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం భారీ డిజాస్టర్ లను ఇచ్చాడు.బోయపాటి శ్రీనుతో యంగ్ హీరోలు సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.

 Boyapati Srinu : యంగ్ హీరోలకు హ్యాండ్ ఇచ-TeluguStop.com

ఇక రీసెంట్ గా ఆయన రామ్ తో చేసిన స్కంద సినిమా( Skanda ) ఫ్లాప్ అవడంతో ఆయనని నమ్మి సినిమా ఇచ్చే యంగ్ హీరో ఎవరు లేకపోవడంతో మళ్లీ బాలయ్య బాబు తోనే బోయపాటి సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో బోయపాటి మరోసారి తన స్టామినా ఏంటో ప్రేక్షకులకు చూపించాలని చూస్తున్నాడు…

వి వి వినాయక్ కూడా ఇదే కొవ కు చెందుతాడు.ఎందుకంటే ఆయన కూడా స్టార్ హీరోలు అందరికీ సక్సెస్ లను అందించాడు.కానీ యంగ్ హీరోలు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ లను ఇవ్వలేకపోయాడు.

దాంతో ఇప్పుడు ఆయనని నమ్మి సినిమా ఇచ్చే హీరోలు అయితే లేరనే చెప్పాలి.ఇక మళ్ళీ ఆయన సినిమా చేయాల్సి వస్తే సీనియర్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాల్సిందే తప్ప, యంగ్ హీరోలు మాత్రమే ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు.ఎందుకంటే ఆయన ఇప్పటికే వరుసగా యంగ్ హీరోలందరికి అల్ట్రా డిజాస్టర్ లను ఇచ్చారు…చూడాలి మరి వినాయక్ మళ్ళీ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తాడా, లేదంటే యంగ్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొడతాడా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube