Nani : నాని కెరీర్ లో ఎంత మంది దర్శకులను, హీరోయిన్స్ ని పరిచయం చేసాడో తెలుసా ?

నాని( Natural Star Nani ) నాచురల్ స్టార్ గా ఎదిగిన విధానం అలాగే కెరియర్ మొత్తం పై అతడు చేసిన సినిమాలు అందరి కన్నా కూడా అతనిని భిన్నమైన స్టార్ గా గుర్తింపు దక్కేలా చేశాయి.ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మినిమం గ్యారెంటీ హీరోగా నాని ఎలా మన కళ్ళముందో ఎదిగాడో మనమందరం చూసాం.

 Directors Who Are Introduced By Hero Nani-TeluguStop.com

అయితే అందరూ నాని లాగా స్టార్ హీరోలు అయిపోవాలంటే అది సాధ్యం కాదు.ఒక హీరో సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకొచ్చి జడ్జ్మెంట్ చేయబడి హిట్టా పట్టా అని తెలుస్తుంది.

అలా ఒక కథ ప్రేక్షకులు జడ్జ్ చేయడానికి ముందే హీరో ఆ కథను ఒక అంచనా వేయగలగాలి.అది నడుస్తుందా లేదా అని క్లారిటీ వస్తే తప్ప ఆ సినిమా చేయడం వల్ల ఉపయోగం ఉండదు.

Telugu Ashta Chamma, Dasara, Directors, Nani, Nandini Reddy-Movie

మరి అలా ఒక అంచనా వేయగలిగే శక్తి ఉన్నప్పుడే మన దగ్గరికి వచ్చే ఎన్నో కథలలో మనకు సరిపోయే అలాగే జనాలు మెచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది.అలా అంచనా వేయడం అందరివల్ల అవుతుందా అంటే అది కష్టమే.చాలా పెద్ద పెద్ద హీరోలు ఇటీవల తీస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనం చూస్తున్నాం. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన మొదటి రోజే థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి.

కానీ వీటన్నిటికీ అతీతంగా ఉంటున్నాయి నాని సినిమాలు.ఎందుకంటే అతడు కథలు ఎంచుకునే విధానం అలాగే సదరు దర్శకులకు అతడు ఇచ్చే అవకాశాలు అలాగే ఉన్నాయి.

Telugu Ashta Chamma, Dasara, Directors, Nani, Nandini Reddy-Movie

ఇప్పటి వరకు కెరియర్ మొత్తం మీద నాని 30 సినిమాల్లో నటించాడు.అందులో రెండు సినిమాల్లో కామియో అపియరెన్స్ ఉన్నప్పటికీ మిగతావన్నీ కూడా ఫుల్ లెన్త్ రోల్ లో నటించిన మూవీస్.ఏది ఏమైనా 30 సినిమాల్లో నటించిన హీరో అంటే మామూలు విషయం కాదు.పైగా ఈ 30 సినిమాలలో 10 మంది కొత్త దర్శకులను అతడు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అంటే నమ్మశక్యంగా లేదు.15 మంది కొత్త హీరోయిన్స్( New Heroines ) కూడా తన సినిమాల ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మరి ఇంత మందికి అవకాశాలు ఇచ్చాడు అంటే నానికి కథ మీద డిమాండ్ తో పాటు సదరు దర్శకుడితో పై కూడా ఒక అంచనా ఉండటమే కారణం.

లేకపోతే ఇది అందరి హీరోలకు సాధ్యం కాదు కదా.నాని పరిచయం చేసిన దర్శకులు ఎవరంటే నందిని రెడ్డి, సత్యం బెల్లం కొండా, గోకుల్ కృష్ణ, శౌర్య వి, శివ నిర్వాణ, నాగ్ అశ్విన్, తాతినేని సత్య, అంజనా అలీ ఖాన్ మరియు శ్రీకాంత్ ఓదెల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube