పాజిటివ్ రోల్స్ లో నటించి మెప్పించడం సులువే అయినా నెగిటివ్ రోల్స్ లో మెప్పించడం సులువు కాదు.అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కు సైతం ప్రాణం పోశారు.
ఈ మధ్య కాలంలో నెగిటి రోల్స్ లో అదరగొడుతున్న హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi SarathKumar ) ముందువరసలో ఉంటారు.క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ మరికొన్ని సినిమాలలో విలన్ గా నటించారు.
రమ్యకృష్ణ( Ramya Krishna ) నరసింహ, రిపబ్లిక్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నెగిటివ్ రోల్స్ లో మెప్పించారు.స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) సైతం సీత సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.విక్రం యూబీపత్తు ఎంద్రాకుల్లం అనే మూవీలో సమంత( Samantha ) సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించడం గమనార్హం.

శ్రీకాంత్ హీరోగా నా మనసిస్తారా అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో సౌందర్య( Soundarya ) నటించారు.అయితే ఈ సినిమాకు ముందు తర్వాత సౌందర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించలేదు.ధర్మయోగి సినిమాలో త్రిష( Trisha ) నెగిటివ్ రోల్ లో నటించారు.సినిమాలో ఈ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్టులు ఉంటాయి.నిజం సినిమాలో రాశి, వల్లభ సినిమాలో రీమాసేన్ నెగిటివ్ రోల్స్ లో నటించారు.

నెగిటివ్ రోల్స్ లో నటించాలని మరి కొందరు స్టార్ హీరోయిన్లు సైతం ఆశ పడుతుండగా ఆయా హీరోయిన్లకు నెగిటివ్ రోల్స్ లో చేసే అవకాశం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో భిన్నమైన కథలకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత పెరుగుతోంది.హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ లో నటిస్తే నిర్మాతలు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తున్నారు.







