మంచు పర్వతాల్లో అన్వేషిస్తున్నప్పుడు వేడి టీలు తాగాలని బాగా అనిపిస్తుంటుంది.ఎత్తైన పర్వతాలపై తెల్లటి మంచు అందాలను చూస్తూ, వేడి టీ సువాసన, వెచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే వచ్చే అనుభూతే వేరు.
చలి, వేడి ప్రశాంతమైన, హాయిగా ఉండే అనుభూతిని అందిస్తాయి.అయితే తాజాగా కొంతమంది ప్రయాణికులు జమ్ము కశ్మీర్( Jammu Kashmir ) పర్వతాలలో ఈ అనుభూతిని ఆస్వాదించాలని కోరుకున్నారు.

కానీ వారి దగ్గర నీరు లేదు.అందుకే గడ్డకట్టిన ఐస్ తో( Frozen Ice ) టీ( Tea ) ఎలా తయారు చేశారు.అంతేకాదు ఆ టీ ఎలా తయారు చేస్తున్నామో చూపించేలా ఓ వీడియో తీశారు.ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.7.6 కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు.స్ట్రీమ్ నుంచి మంచును( Snow ) పొందడానికి వారు గ్లాస్ ఎలా ఉపయోగించారో వీడియో చూపిస్తుంది.ఆపై వారు మంచును కరిగించి ఉడకబెట్టడానికి చిన్న స్టవ్‌ను ఉపయోగించారు.
నీటిలో టీ ఆకులు, చక్కెరను జోడించారు.ఒక బాక్స్ నుంచి పాలు పోశారు.
చల్లటి వాతావరణంలో టీ తయారు చేసి ఆనందంగా తాగారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో “మేకింగ్ చాయ్ ఆన్ ఎ ఫ్రోజెన్ స్ట్రీమ్” అనే పోస్ట్ చేశారు.చాలా మంది ఈ వీడియోను లైక్ చేసారు.తమ స్నేహితులతో కూడా ఇలాంటి టీ తయారుచేసుకొని తాగుతామని కొందరు పేర్కొన్నారు.“ఇది సరదాగా కనిపిస్తుంది”, “ఇది గొప్ప సాహసం.” వావ్ ఐస్ టీ’ అంటూ కొందరు జోకులు కూడా వేశారు.అయితే టీ పరిశుభ్రతపై కొందరు ఆందోళన చెందారు.మంచులో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే దానినే టీ తాగడానికి తెలియకుండా వాడేస్తే పరిస్థితి ఏంటని మరికొందరు అన్నారు.
ఇది ఆరోగ్యానికి హానికరమని ఒకరు పేర్కొన్నారు.







