Klinkaara Twin Sisters : ట్విన్ సిస్టర్స్ ను కలిసిన క్లిన్ కారా… వైరల్ అవుతున్న ఫోటోలు?

మెగా హీరో రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రామ్ చరణ్ ఉపాసన( Upasana ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరూ పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారారు.

 Upasana Posts A Pic Of Her Daughter With Twin Sisters-TeluguStop.com

ఇక గతేడాది ఉపాసన క్లీన్ కార( Klinkaara ) కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఇలా ఉపాసన రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లీన్ కారా ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

ఈ చిన్నారి ఫేస్ కనపడకుండా రాంచరణ్ ఉపాసన ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇకపోతే ఈ చిన్నారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా క్లీన్ కారా తన ట్విన్ సిస్టర్స్( Klinkaara Twin Sisters ) కలిసినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఉపాసన ట్విన్ సిస్టర్స్ కలవడం ఏంటి అనే విషయానికి వస్తే.ఉపాసన సోదరి అన్షు పాల( Anshupala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గత మూడు సంవత్సరాల క్రితం ఈమె వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం ఉపాసన తన సోదరి సీమంతపు వేడుకల నిమిత్తం ముంబై వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.ఇలా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బేబీస్ ఆన్ ద వే అంటూ చెప్పుకోవచ్చారు.అయితే తాజాగా ఉపాసన సోదరి అన్షు పాల్ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారని తెలుస్తుంది.

తాజాగా తన ఇద్దరు కవల పిల్లలతో అన్షు పాల్ దంపతులతో రామ్ చరణ్ దంపతులు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

వీరందరూ కలిసి ఒక వేడుకలో పాల్గొనడం జరిగింది.దీంతో ఇలా ఉపాసన సిస్టర్స్ కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది.ఇందులో ఉపాసన సోదరి తన ఇద్దరు కవల పిల్లలతో, రామ్ చరణ్ ఉపాసన తన కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

అద్భుతమైనటువంటి ముగ్గురిని మేము మీకు పరిచయం చేస్తున్నాము.ఈ ముగ్గురు పవర్ పఫ్ గర్ల్స్.క్లిన్ కారా తన ఇద్దరి సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం,( Ayraa Pushpa Ebrahim ) రైకా సుచరత ఇబ్రహీంలతో( Ryka Sucharita Ebrahim ) కలిసిపోయింది అంటూ ఈ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోలలో కూడా ఈ ముగ్గురు చిన్నారుల పేస్ కనపడకుండా జాగ్రత్త పడటంతో పలువురు ఈ ఫోటో పై స్పందిస్తూ ఇక మీరు ఎవరు కూడా వారి పిల్లలను కెమెరాకు చూపించరేమో అంటూ కామెంట్లు చేయక మరికొందరు కంగ్రాట్యులేషన్స్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇకపోతే మరికొందరు క్లీన్ కారా మనసులో మాటలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నార.క్లిన్ కారా మనసులో నన్ను కెమెరాకు చూపించు నాన్న అని ఫీల్ అవుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలు పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube