టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry ) చరిత్ర గురించి మాట్లాడుకుంటే చిరంజీవి పేరును ఎక్కువగా ప్రస్తావించాల్సి ఉంటుంది.చిరంజీవి సెల్ఫ్ మేడ్ స్టార్ అని ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ స్థాయికి చేరారని చాలామంది భావిస్తారు.
అయితే టాలీవుడ్ లో చిరంజీవి తర్వాత ఆ స్థాయి నటుడెవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిర్వహించే సర్వేలలో ఎక్కువమంది ప్రభాస్, ఎన్టీఆర్ లకు ఓటేస్తున్నారు.
ప్రభాస్( Prabhas ) తన యాక్టింగ్ టాలెంట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ వివాదాలకు దూరంగా ఉండటంతో ఎక్కువమంది ఈ కామెంట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) విషయానికి వస్తే ఎలాంటి రోల్ ఇచ్చినా తన నటనతో సులువుగా మెప్పించే టాలెంట్ ఈ హీరో సొంతమనే సంగతి తెలిసిందే.
మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం చిరంజీవి తర్వాత ఆ స్థాయి తమ హీరోకే సొంతమని చెబుతున్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ఆ రేంజ్ ఉన్నా పవన్ ప్రస్తుతం సినిమాల కంటే పొలిటికల్ గా సక్సెస్ సాధించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.అందువల్ల పవన్ సినిమాల కంటే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని పవన్ కళ్యాణ్ సీఎం కావాలని పవన్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే చిరంజీవికి ఆ స్థాయి, స్థానం ఊరికే రాలేదు.దశాబ్దాల పాటు నంబర్ వన్( Tollywood Number One Hero ) స్థానంలో కొనసాగడం సులువు కాదు.కనీసం పదేళ్ల పాటు నటన, కలెక్షన్లు, విమర్శకుల మెప్పు పొందే సత్తా ఉన్న హీరో ఎవరైనా ఉంటే ఆ హీరో మాత్రమే చిరంజీవి తర్వాత ఆ స్థాయి నటుడు అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.