Aishwarya Rajinikanth : ఒంటరిగా గడపడమే బాగుంది.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ ( Danush ) ఐశ్వర్య రజనీకాంత్ ( Aishwarya Rajinikanth ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో దాదాపు 18 ఏళ్లు ఎంతో సంతోషంగా గడిపారు.

 Aishwarya Rajinikanth Comments Viral About Her Divorce-TeluguStop.com

అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయిన సంగతి తెలిసింది.వీరిద్దరు విడాకులు తీసుకోకపోయినా విడిగా ఉంటున్నారు.

ఇలా విడాకులు తీసుకోకపోవడంతో ఎప్పటికైనా వీరిద్దరు కలుస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా ఐశ్వర్య ధనుష్ చేసిన కామెంట్స్ చూస్తే కనుక వీరిద్దరి జీవితంలో కలవరని స్పష్టంగా అర్థమవుతుంది.

Telugu Aishwarya, Danush, Divorce, Lal Salam-Movie

ఇటీవల ఐశ్వర్య ధనుష్ డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి లాల్ సలామ్ ( Lal Salam ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.ఇలా ఎప్పటికప్పుడు ధనుష్ తన భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ వచ్చారు.కానీ ఐశ్వర్య మాత్రం పూర్తిగా తన భర్తను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారని తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తేనే అర్థమవుతుంది.

Telugu Aishwarya, Danush, Divorce, Lal Salam-Movie

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఐశ్వర్య మొదటిసారి విడాకుల గురించి మాట్లాడారు.ఒకప్పటి కంటే ఇప్పుడే తన జీవితం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు.ఒంటరిగా ఉండటమే బాగుందని, ఒంటరిగా జీవితంలో ముందుకు వెళ్లటమే చాలా ఈజీ అవుతుందని ఈమె తెలిపారు.గడిచిన రెండేళ్లుగా నేను ఒంటరిగానే జీవిస్తున్నాను.అయితే ఈ సింగిల్ లైఫ్ ను ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నాను.ఒంటరిగా ఉండటమే ఎంతో సురక్షితం అనిపిస్తుందని ఈమె తెలిపారు.

ఒకప్పుడు పిల్లల కోసమే నా సినీ కెరియర్ కు బ్రేక్ ఇచ్చానని ఈ ప్రపంచం చాలా ఫాస్ట్ గా పరిగెడుతోందని సమయమే తెలియడం లేదు అంటూ  ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube