Dog Viral Video : వీడియో: ఈ కుక్క అమ్మాయిలకు ఎలా లైన్ వేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు…

ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే కొన్ని జంతువుల వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.అందుకు కారణం ఆ జంతువులు చాలా విచిత్రంగా, ఒక్కోసారి మనుషుల లాగా ప్రవర్తించడమే అని చెప్పుకోవచ్చు.తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.@Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసిన దీనికి ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక బైక్ వెనక కుక్క( Dog ) కూర్చుని ఉండటం చూడవచ్చు.

 Dog Playing Romantic Antics While Seeing Ladies Video Viral-TeluguStop.com

బైక్‌ను( Bike ) ఒక మనిషి రైడ్ చేస్తున్నాడు.

బహుశా సిగ్నల్ పడినట్లు ఉంది.అందుకే ఆ బైక్ రైడర్ ఆగిపోయాడు.

కుక్క బైకు వెనక సీట్ పై వెనక్కి తిరిగి కూర్చుంది.అది అటువైపుగా వెళ్తున్న వారిని చూస్తూ ఉంది.

ఇంతలోనే కొంతమంది అమ్మాయిలు( Ladies ) గుంపు అటువైపుగా నడవడం చూసింది.అంతే అది తన గడ్డం కింద తన ముందర కాలును పెట్టుకొని చాలా హ్యాండ్సమ్ గా పోజ్‌ ఇచ్చింది.

అది చూసి అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అయ్యారు.దాని తలపై నిమురుతూ తమ ప్రేమను కురిపించారు.ఈ కుక్క రొమాంటిక్ చేష్టలను అక్కడే ఉన్న మరొక వ్యక్తి వీడియో తీశాడు.ఆ విషయాన్ని గమనించిన కుక్క కెమెరా వైపు చూసి కొంటెగా కన్ను కొట్టింది.

ఈ దృశ్యాలన్నీ కూడా చూసేందుకు అద్భుతంగా అనిపించాయి.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ కుక్క మామూలుది కాదని కామెంట్లు పెడుతున్నారు.”ఈ కుక్కలోకి ఎవరో యువకుడి ఆత్మ చొరబడినట్టుంది అసలు అమ్మాయిలను చూడగానే ఇలా రియాక్ట్ అయ్యే కుక్కను

నేను ఎక్కడా చూడలేదు.” అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.ఈ కుక్క మనుషులకంటే అందంగా కన్ను కొడుతోంది గా అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇంకొక్క చాలా మంది యువకుల కంటే అమ్మాయిలకు బాగా లైన్ వేస్తోంది అంటూ మరికొందరు ఫన్నీగా( Funny ) వ్యాఖ్యానించారు.అది అమ్మాయిలను చూడడానికే ఇలా బైక్ పై వెనక్కి తిరిగి కూర్చున్నట్లు ఉంది అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.

ఇది ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ డాగ్( Most Interesting Dog ) అని, ఇలాంటి కుక్క తమకు ఒకటి కావాలని చాలామంది కామెంట్ సెక్షన్ లో తమ కోరికలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube