Amla Powder : రోజు ఈ పొడిని మొదటి ముద్దలో తిన్నారంటే వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వ‌ర‌కు ఎన్నో లాభాలు మీ సొంతం!

పిల్లల నుంచి పెద్దల వరకు పచ్చళ్లంటే పడి చచ్చిపోతుంటారు.అయితే పచ్చళ్లతో పాటు పొడులు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి.

 Consuming This Powder Daily Will Bring Many Health Benefits-TeluguStop.com

ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.అటువంటి వాటిల్లో ఉసిరికాయ పొడి కూడా ఒకటి.

ఈ పొడిని ప్రతి రోజు మొదటి ముద్దలో తిన్నారంటే వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.పైగా ఉసిరికాయ పొడిని తయారు చేసుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు.

ఒక కప్పు ఉసిరికాయలు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.ఆపై గింజ‌ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Amla, Amla Powder, Amlapowder, Diabetes, Tips, Healthy, Usirikaya Podi-Te

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard oil ) మరియు ఉసిరికాయ ముక్కలు వేసి కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో మరొక స్పూన్ ఆవ నూనె, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ శనగపప్పు, ప‌ది ఎండు మిర్చి, పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసి వేయించుకోవాలి.అనంత‌రం మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలతో సహా వేయించుకున్న పదార్థాలన్నీ వేసి రుచికి తగినంత ఉప్పు కలిపి బరకగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ పొడి సిద్ధమవుతుంది.ఈ పొడి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.

రోజు భోజనం చేసే సమయంలో ఒక స్పూన్ ఉసిరికాయ పొడిని మొదటి ముద్దలో కలిపి తీసుకోవాలి.ఈ ఉసిరికాయ పొడిలో విటమిన్ సి( Vitamin C ) మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌ రిచ్ గా ఉంటాయి.

ఇవి మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.జ‌లుబు, ద‌గ్గు వంటి సమస్యలు ఉంటే దూరం చేస్తాయి.

Telugu Amla, Amla Powder, Amlapowder, Diabetes, Tips, Healthy, Usirikaya Podi-Te

అలాగే ఈ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల మెటబాలిజం( Metabolism ) రేటు పెరుగుతుంది.దాంతో కేలరీలు త్వరగా కరిగి వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాకుండా ఉసిరికాయ పొడిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.కంటి చూపు షార్ప్ గా మారుతుంది.కొలెస్ట్రాల్ క‌రిగి గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు ఈ పొడిలో ఐరన్ కంటెంట్ కూడా మెండుగా ఉండడం వల్ల రక్తహీనత సైతం దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube