ఏపీలో రాజ్యసభ ఎన్నికల బరిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ( TDP ) నిలువనుంది.ఈ మేరకు నామినేషన్ పత్రాలను టీడీఎల్పీ కొనుగోలు చేశారు.
ఈ నేపథ్యంలోనే నామినేషన్ పత్రాలపై టీడీఎల్పీ సిబ్బంది ప్రతిపాదిత సంతకాలు చేయించింది.మూడు స్థానాల కోసం రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే పార్టీకి పూర్తి స్థాయి బలం లేకున్నా ఎన్నికలకు టీడీపీ సిద్ధం అవుతుంది.అంతేకాదు వైసీపీ( ycp ) అసంతృప్త ఎమ్మెల్యేలపై టీడీపీ ఆశలు పెట్టుకుందని తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.