Yatra 2 Review : యాత్ర 2 రివ్యూ అండ్ రేటింగ్

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ మహి వి రాఘవ్ యాత్ర( Yatra ) సినిమాని చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుకొని ఆయన రాజకీయాలలోకి రావడం సంక్షేమ పథకాలను అమలు పరచడం అనంతరం ప్రమాదంలో మరణించడం వంటి సన్నివేశాలను చూపించారు.

 Yatra 2 Review : యాత్ర 2 రివ్యూ అండ్ రేటి-TeluguStop.com

ఇక ఈ సినిమా చిత్రంగా యాత్ర 2( Yatra 2 ) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఈ సినిమాలో తండ్రి రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్( YS Jagan ) ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా చూపించారు ఇక ఈ సినిమా నేడు ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే…

కథ:

యాత్ర సినిమా ద్వారా డైరెక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇందులో భాగంగా ఈయన పేర్లను మార్చకుండా వారి రియల్ పేర్లతోనే క్యారెక్టర్ లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

వైఎస్సార్(మమ్ముట్టి), జగన్(జీవా), చంద్రబాబు(మహేష్ మంజ్రేకర్) అంటూ ఇలా రియల్ కారెక్టర్ల పేర్లనే పెట్టేశాడు.వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెట్టే సీన్‌తో కథ మొదలవుతుంది.

ఇలా తన కొడుకును ఎంపీగా మొదలు పెట్టడంతో గొడవలు జరగడం అనంతరం రాజశేఖర్ రెడ్డి( YS Rajashekar Reddy ) సీఎం అవ్వడం ప్రమాదంలో ఆయన మరణించడం వంటి సన్నివేశాలను చూపించారు.

Telugu Cm Jagan, Mahi Raghav, Jiiva, Jiiva Yatra, Mammootty, Yatra, Yatra Review

తండ్రి మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపడితే హై కమాండ్ అడ్డుకోవడం ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం లాంటి సన్నివేశాలను కూడా అద్భుతంగా.సిబిఐ దాడులు, జగన్ అరెస్ట్ వంటి అంశాలు చూపిస్తారు.ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం, చంద్రబాబు(మహేష్ మంజ్రేకర్)( Mahesh Manjrekar ) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం, పాదయాత్ర చేయడం చూపిస్తారు.

చివర్లో 2019 లో జగన్ సీఎం అవ్వడం అనేది యాత్ర 2 కథాంశం.

Telugu Cm Jagan, Mahi Raghav, Jiiva, Jiiva Yatra, Mammootty, Yatra, Yatra Review

నటీనటుల నటన:

ఈ సినిమాలో రాజకీయ నాయకుల పాత్రలలో ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేస్తూ నటించారని చెప్పాలి.ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్రలో నిజంగా నటించడం కంటే జీవించేశారని చెప్పడం కరెక్ట్.కొన్నిచోట్ల నటుడు జీవా( Jiiva ) ను కాకుండా సాక్షాత్తు వైయస్ జగన్ ని చూస్తున్న అనుభూతి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలుగుతుంది.

తన నటనతో కొన్నిచోట్ల అభిమానులకు కన్నీళ్లు కూడా పెట్టించారు.మమ్ముట్టి( Mammootty ) పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు ఈయన ఈ సినిమాలో కనిపించేది కొంతసేపైనా అద్భుతమైన నటన కనబరిచారు.

ఇలా ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు.

Telugu Cm Jagan, Mahi Raghav, Jiiva, Jiiva Yatra, Mammootty, Yatra, Yatra Review

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమా అన్ని విషయాలలోనూ అద్భుతంగా అనిపించిందని చెప్పాలి.మధి విజువల్స్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌లో ఉన్నాయి.ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ అయింది అని చెప్పాలి.

సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌గా నిలిచాడు.మాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి.

ఎడిటింగ్, ఆర్ట్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో యాత్ర 2 హై స్థాయిలో ఉంది.

Telugu Cm Jagan, Mahi Raghav, Jiiva, Jiiva Yatra, Mammootty, Yatra, Yatra Review

విశ్లేషణ:

యాత్ర 2 కథ( Yatra 2 Story ) అందరికీ తెలిసినదే ఈ కథ ప్రారంభం అలాగే ముగింపు ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ ఈ సినిమాని ఎలా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలి అనేదే ముఖ్యమైనటువంటి విషయం ఇదే విషయాన్ని డైరెక్టర్ కూడా పలు సందర్భాలలో చెబుతూ వచ్చారు.ఎక్కడ ఎమోషనల్ సీన్స్ పెట్టాలనే విషయంపై ప్రేక్షకుల నాడి డైరెక్టర్ తెలుసుకున్నారని సినిమా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ సినిమా( Political Movie ) అయినప్పటికీ సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ అవ్వడం గుండె బరువెక్కడం వంటి సంఘటనలు జరుగుతాయి తండ్రికి కోసం కన్న కొడుకు జైలు పాలు కావటం తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఓ కొడుకు పడే ఆరాటం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.ఈ సినిమా కథ అందరికీ తెలిసినదే అయినప్పటికీ సినిమా చూస్తున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, ఎమోషనల్ సన్నివేశాలు, మ్యూజిక్, కొన్ని సన్నివేశాలు రియల్ విజువల్స్ చూపించడం.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోర్ అనిపించాయి.

బాటమ్ లైన్:

అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ సినిమాని సరికొత్తగా చూపించి అందరి హృదయాలను బరువెక్కిలా చేస్తూ సినిమాని ఎంతో అద్భుతంగా మలిచారు.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube