గ్లోబల్ మార్కెట్లో ( Vivo V30 smartphone )వివో వీ30 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

వివో వీ30 స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD అమోలెడ్ డిస్ ప్లే తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14( Android 14 ) ఆధారిత ఫన్టచ్ OS 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ, HDR 10+సపోర్ట్ ఉన్న 3D కర్వ్డ్ డిస్ ప్లే తో వస్తోంది.
క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ పై పని చేస్తుంది./br>

50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఓమ్నీ విజన్ OV50E సెన్సార్( OmniVision OV50E sensor ) తో ఉంటుంది.50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ర్టేయిట్ సెన్సార్ తో ఉంటుంది.వీడియో కాల్స్ సెల్ఫీల కోసం ముందువైపు 50 మేకప్ పిక్సెల్ లెన్స్ తో ఉంటుంది.
ఈ ఫోన్లో ఉండే మూడు కెమెరాలు 50 మెగా పిక్సెల్ కెమెరాలే.ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, 80w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 0.75 సెంటీమీటర్ల బంధం ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM+128GB స్టోరేజ్, 8GB RAM+256GB స్టోరేజ్, 12GB RAM+256GB స్టోరేజ్, 12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్లతో లాంచ్ అయ్యింది.ఈ స్మార్ట్ ఫోన్ బ్లూమ్ వైట్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్, లష్ గ్రీన్ కలర్ ఆప్షన్ లలో ఉంటుంది.
ఈ ఫోన్ ఫిబ్రవరి 8 అంటే ఈరోజు మెక్సికోలో లాంచ్ కానుంది.ఆ తర్వాత భారత్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంకాంగ్, థాయిలాండ్, యూఏఈ సహా 30 దేశాల్లో విడుదల కానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర ను కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.







