జిల్లాలో వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో వాలీబాల్ ఛాంపియన్ షిప్ -2024( Volleyball championship ) అనే పేరుతో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు మహిళలకు, పురుషులకు వేరు వేరుగా నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని జిల్లా యువజన, క్రీడాధికారి అజ్మీరా రాందాస్ తెలిపారు.

 Volleyball Championship Competitions In The District-TeluguStop.com

ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఆదేశాల మేరకు ఇట్టి వాలీబాల్ ఛాంపియన్ షిప్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన,క్రీడాధికారి అజ్మీరా రాందాస్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఆసక్తి గల యువతీ, యువకులు తమ జట్ల వివరాలను సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రెండవ అంతస్తు లో గల యువజన, క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 15 లోగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఒక్కో టీమ్ కు ఎంట్రీ ఫీజు 1,000 రూపాయలు మాత్రమే అని తెలిపారు.జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన మహిళలు, పురుషుల జట్లకు క్యాష్ ప్రైజ్ తో పాటు క్రీడా ట్రోఫీ ని విజేతలకు కలెక్టర్, ఎస్పీ ల చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.ఫిబ్రవరి మాసంలో పోటీలు నిర్వహించే తేదీలను, క్యాష్ ఫ్రైజ్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

జట్ల వివరాలను నమోదు చేసుకునేందుకు 9440239783, 9059465889, 7569207411 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube