Kohinoor Diamond : కోహినూర్ డైమండ్ ఎవరి వద్ద ఉంటే వారి జీవితం సర్వనాశనం..?

కోహినూర్ డైమండ్( Kohinoor Diamond ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఇది చాలా పెద్ద, మెరిసే వజ్రం.

 Kohinoor Diamond : కోహినూర్ డైమండ్ ఎవరి వ-TeluguStop.com

ప్రస్తుతం ఈ మిరిమిట్లు గొలిపే వజ్రం యూకేలోని క్రౌన్ జ్యువెల్స్‌లో ( Crown Jewels in UK )భాగంగా ఉంది.యూకే రాజు, రాణి ఇప్పుడు దానిని కలిగి ఉన్నారు.

అయితే ఈ వజ్రం శాపగ్రస్తమైందని కొందరు అంటున్నారు.ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని దురదృష్టం వెంటాడుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మగవారి వద్ద ఉంటే వారి జీవితం నాశనమే అని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రస్తుతం యూకే కింగ్ ( UK King )అనారోగ్యంతో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.అదంతా వజ్రం( diamond ) వల్లనే జరుగుతోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Telugu British, Crown Jewels, India, Koh Noor, Kohinoor Curse, Mythology, Owners

ఈ వజ్రం చాలా కాలం క్రితం భారతదేశంలో దొరికింది.ఇది చాలా విలువైనది, అందంగా ఉంటుంది.దీనిని పొందాలని చాలా మంది రాజులు కోరుకుంటూ దాని కోసం యుద్ధాలు చేశారు.ఈ వజ్రం చాలా మంది చేతుల్లో మారుతూ వచ్చింది.ఇది వివిధ ప్రాంతాలు, దేశాలకు ప్రయాణించింది.

Telugu British, Crown Jewels, India, Koh Noor, Kohinoor Curse, Mythology, Owners

బ్రిటిష్ వారు 1849లో భారతదేశం నుండచి వజ్రాన్ని తీసుకువెళ్లారు.వారు దానిని రాణికి కిరీటంలో పెట్టారు.కానీ శాపానికి భయపడిపోయారు.

వారు తమ కుమారులను వజ్రాన్ని ధరించనివ్వలేదు.కుమార్తెలు, భార్యలు మాత్రమే దీనిని ధరించారు.

దానిని వారు ప్రత్యేక రోజుల్లో ధరించేవారు.భారతదేశంలోని కొంతమంది వజ్రాన్ని తిరిగి పొందాలని కోరుతున్నారు.

బ్రిటీష్( British ) వారు దొంగిలించారని అది భారత్ కే చెందాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే యూకే ప్రభుత్వం దానిని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.

ఆ వజ్రం ఇప్పుడు తమదే అని అంటున్నారు.ఇకపోతే కోహినూర్ చాలా పురాతనమైనది, దాని గురించి చాలా కథలు, పురాణాలు ఉన్నాయి.

కొంతమంది వాటిని నమ్ముతారు.కొంతమంది వాటిలో నిజం లేదని కొట్టి పారేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube