Kunal Shah : విజయానికి ముందు డెలివరీ బాయ్‌గా పనిచేసిన క్రెడ్ సీఈఓ.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ వైరల్..

సక్సెస్ సాధించడం ఎవరికీ సులభమేమీ కాదు.ఎన్నో సవాళ్లను, కష్టాలను అధిగమించిన వారిని మాత్రమే విజయం వరిస్తుంది.

 Cred Ceo Who Worked As A Delivery Boy Before Success Inspirational Story Viral-TeluguStop.com

ఈరోజు పెద్ద కంపెనీలకు అధినేతలుగా ఉన్నవారు ఒకప్పుడు పేదరికంలో మగ్గిన వారే.పొట్టకూటి కోసం చిన్నాచితక ఉద్యోగాలు చేసిన వారే.

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన “క్రెడ్” సీఈఓ కునాల్ షా( Kunal Shah ) జీవితం కూడా కష్టాలు, కన్నీళ్ళతోనే మొదలయ్యింది.ఈ సక్సెస్‌ఫుల్‌ ఎంట్రప్రిన్యూర్‌ తన లక్ష్యాలను, సాధించడానికి ముందు అనేక డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చింది.

అతను ముంబైలోని విల్సన్ కాలేజీ( Wilson College)లో ఫిలాసఫీ చదివారు, వేరే కోర్సు చేసే టైమ్, వీలు లేకపోవడంతో కునాల్ ఆ పని కోర్సు వచ్చింది.అతని కుటుంబం ఒకానొక సమయంలో దివాలా తీసింది.వారికి మద్దతు ఇవ్వడానికి కునాల్ డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చింది.ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఖాళీ సమయం ఉండటంతో ఆ సమయంలోనే ఫిలాసఫీ క్లాసులకు హాజరయ్యారు.

అతని షెడ్యూల్‌కు సరిపోయే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ అని తనకు చెప్పినట్లు ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఢిల్లీ( Delhi)లోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాను కలుసుకుని అతని కథ గురించి తెలుసుకున్నానని సంజీవ్ చెప్పారు.అతని దృఢత్వానికి, ధైర్యానికి ఆశ్చర్యపోయానని అన్నారు.చాలా మంది అతని పోస్ట్‌ను చూసి కునాల్ షా ప్రయాణం నుంచి ప్రేరణ పొందారు.

వారు అతనిని ప్రశంసిస్తూ విజయానికి సంబంధించిన సొంత కథలను పంచుకున్నారు.కష్టపడి పని చేస్తే జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదని కునాల్ షా చూపించారని చెప్పారు.

ఇక గతంలో కునాల్ షా మాట్లాడుతూ తన కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో జీతం తీసుకోనని కూడా వెల్లడించారు.ఈ కంపెనీ నుంచి తాను నెలకు రూ.15వేలు మాత్రమే జీతం తీసుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.తన కంపెనీ లాభసాటిగా ఉండేంత వరకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం ఇష్టం లేదన్నారు.

గతంలో తన కంపెనీ ఫ్రీచార్జ్‌ని విక్రయించడంతో చాలా డబ్బులు వచ్చాయని వాటి మీదనే బతుకుతున్నానని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube