Apartment Floor : ఒక్కసారిగా కూలిపోయిన ఫ్లోర్.. ఇతడు ఎలా తప్పించుకున్నాడో చూస్తే..

కొంతమంది ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా రియాక్ట్ అవుతూ ప్రాణాలు రక్షించుకుంటారు.రెప్పపాటులో జరిగే అలాంటి సంఘటనల్లో వారి క్విక్‌ యాక్షన్స్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవాల్సిందే.

 The Floor Collapsed Suddenly If You See How He Escaped-TeluguStop.com

ఇలాంటి ఘటనలను క్యాప్చర్ చేసే వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో అకస్మాత్తుగా ఓ అప్పర్ అపార్ట్‌మెంట్ ఫ్లోర్( Apartment floor ) కూలిపోయింది.

ఆ అపార్ట్‌మెంట్ ఫ్లోర్ పై కుర్చీల్లో కూర్చొని కొందరు పని చేసుకుంటున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో ఒక వ్యక్తి కూర్చున్న ప్లేస్‌లో ఫ్లోర్ కూలింది.పేక ముక్కల్లా ఫ్లోర్ టైల్స్ సెకన్లలో కూలిపోయి కింద పడిపోతుంటే సదరు వ్యక్తి మిల్లి సెకన్లలో రియాక్ట్ అయ్యాడు.తన పాదాలతో ఫాస్ట్ గా కూలని భాగాల్లో పెట్టాడు.

అతడి వెనుక పెద్ద రంధ్రమే ఏర్పడింది.అందులో పడిపోకుండా ఈ వ్యక్తి చాలా వేగంగా యాక్ట్ చేసిన తీరు వావ్ అనిపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీసీటీవీ ఇడియట్స్ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటిదాకా రెండు లక్షల దాకా వ్యూస్‌, 3 వేల లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు చాకచక్యంగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తిని పొగుడుతున్నారు.మరి కొంతమంది అదృష్టం బాగుండి అతడు దీని నుంచి బయటపడ్డాడని అంటున్నారు.ఇది చైనా( China )లో జరిగిందని చైనా నిర్మాణాలన్నీ ఇలానే ఉంటాయని ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఈ వీడియో క్లిప్ పై మీరూ ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube