దర్శకుడు జయశంకర్( Jaya Shankar ) గురించి మనందరికీ తెలిసిందే.పేపర్ బాయ్ ( Paper Boy )సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జయశంకర్ ఈ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
సంతోష్ శోభన్ హీరోగా నటించిన పేపర్ బాయ్ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా అటు సంతోష్ శోభన్ కి అలాగే ఇటు జయశంకర్ కి ఇద్దరికీ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.
ఇది ఇలా ఉంటే దర్శకుడు జయశంకర్ ఇప్పుడు మరొక డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.అరి అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉంది.

అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారు నటించారు.కమెడియన్ హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ లు కూడా ముఖ్య పాత్రల్లో పోషించారు.అయితే ఈ మూవీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ మూవీ రీమేక్‌కు సంబంధించిన వార్తలు చర్చల్లోకి వచ్చాయి.మొన్నా ఈ మధ్య శివ కార్తికేయన్( Sivakarthikeyan ) తన సినిమా ప్రమోషన్స్ వచ్చాడు.
ఈ క్రమంలోనే అరి దర్శకుడు జయ శంకర్ కలిశాడు.అరి సినిమా గురించి చర్చించాడు.
ట్రైలర్ చూసి మెచ్చుకున్నాడు.సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
ఇలా కోలీవుడ్‌లోకి అరి వెళ్లే అవకాశం ఉంది.అదేవిధంగా బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ యాక్టర్ అరి మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.</br

అభిషేక్ సైతం అరిని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట.మరి శివ కార్తికేయన్, అభిషేక్ బచ్చన్‌లు రీమేక్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి మరి.అరి మూవీ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాపై బాలీవుడ్,కోలీవుడ్ సెలబ్రిటీలు ఫోకస్ చేయడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగాయి.దానికి తోడు ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవ్వడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.మరి ఈ సినిమాతో దర్శకుడు జయశంకర్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తారో చూడాలి మరి.