దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు( UPI Payments ) వేగవంతం అవుతున్నాయి.చాలావరకు యూపీఐ చెల్లింపులు పరంగానే వ్యాపారాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త తెలియజేసింది.జోన్ పరిధిలో సికింద్రాబాద్ తో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్( Digital Payments ) అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
దీంతో పిఓఎస్, యూపీఐ (ఫోన్ పే, గూగుల్ పే) మొదలగు వాటి ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.ఈ డిజిటల్ పేమెంట్ విధానం ద్వారా ప్రయాణికుల సమయం ఆదా అవటం మాత్రమే కాదు చిల్లర సమస్య కూడా తీరుతుందని అధికారులు చెబుతున్నారు.
కరోనా తర్వాత దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్ల వినియోగం వేగంగా పెరిగిపోయింది.టీ స్టాల్స్, చిన్న చిన్న కిరాణా దుకాణాల నుండి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ లావాదేవీలు విరివిగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే( South Central Railway ) కూడా డిజిటల్ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టడం సంచలనంగా మారింది.సాధారణంగా రైల్వే టికెట్ల కౌంటర్ దగ్గర చిల్లర సమస్య ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా రిజర్వేషన్ కౌంటర్ వద్ద పాసింజర్ లు ఈ సమస్యని ఎదుర్కొంటారు.ఈ క్రమంలో దక్షిణ రైల్వే శాఖ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి తీసుకురావడం పట్ల రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.