ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తీవ్రంగా మండిపడ్డారు.జగన్ ప్రభుత్వంలో పోలీసులకు భద్రత లేదని ఆరోపించారు.
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ మృతి బాధాకరమని పేర్కొన్నారు.విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ గణేశ్ ( Constable Ganesh )కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యాయని మండిపడ్డారు.