బ్రిటన్ మహారాజు కింగ్ చార్లెస్ III ( King Charles III )క్యాన్సర్ బారినపడినట్లుగా సోమవారం బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించిన నేపథ్యంలో పలు దేశాల అధినేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు( Joe Biden ) కూడా కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘‘హిస్ మెజెస్టి కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలని భారతదేశ ప్రజలతో పాటు నేను ఆకాంక్షిస్తున్నానని’’ మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఏడు దశాబ్ధాలకు పైగా సుదీర్ఘకాలంగా సార్వభౌమాధికారం కోసం వేచిచూసిన కింగ్ చార్లెస్ .క్వీన్ ఎలిజబెత్ II( Queen Elizabeth II ) మరణం తర్వాత బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరుపుకున్నారు.ఈ క్రమంలో ఆయన క్యాన్సర్ బారినపడటంతో చికిత్స చేయించుకోవడానికి విధులు, ఇతర బహిరంగ కార్యక్రమాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.
సెప్టెంబర్ 8, 2022న చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించారు.ఆయన అధికారిక పట్టాభిషేకం గతేడాది మే 6న జరిగింది.18 నెలలుగా ఆయన దేశాన్ని పాలిస్తున్నారు.

కింగ్ చార్లెస్ తన వైద్య బృందానికి, వారి వేగవంతమైన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.చికిత్సపై సానుకూలంగానే వున్న ఆయన.వీలైనంత త్వరగా ప్రజా సేవలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్( Buckingham Palace ) తెలిపింది.మరోవైపు.కింగ్ ఛార్లెస్ వేగంగా కోలుకోవాలని యూకే ప్రధాని రిషి సునాక్ ఆకాంక్షించారు.ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.ఇవాళ దేశం మొత్తం రాజుకు అండగా నిలబడుతుందని యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.
అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.క్యాన్సర్‌పై పోరాటానికి ఆశ, ధైర్యం అవసరమని.
తన సతీమణి జిల్ బైడెన్, యూకే ప్రజలు మెజెస్టి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామన్నారు.







