హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశం( BRS meeting ) ముగిసింది.ఇందులో భాగంగా కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక సూచనలు చేశారు.
ఈనెల 13వ తేదీన నల్గొండలో బహిరంగ సభను ( public meeting )విజయవంతం చేయాలన్నారు.ఈ సభకు ఐదు జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని పేర్కొన్నారు.

నియోజకవర్గాల వారిగా ఇంఛార్జుల నియామకం చేయాలన్న ఆయన కేఆర్ఎంబీపై తెగించి కొట్లాడుదామని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు.అయితే కేంద్రం సూచనలను బీఆర్ఎస్ అంగీకరించలేదన్నారు.ఈ క్రమంలో మీరు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం రద్దు చేసి తీసుకోవాలని చెప్పామని వెల్లడించారు.







