Laggam : పెళ్లిపుస్తకం తరువాత నా కెరీర్ లో ఆ స్థాయి చిత్రం లగ్గం : డా రాజేంద్రప్రసాద్

సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం( Laggam )భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు.సాయి రోనక్, గనవి లక్ష్మణ్( Sai Ronak , Ganvi Laxman ) హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

 Laggam Is As Awesome As Pelli Pusthakam Dr Rajendra Prasad-TeluguStop.com

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా డా .రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ…లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నాను.నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి.“లగ్గం విందు భోజనం” లాంటి సినిమా అన్నారు.

దర్శకుడు రమేష్( Ramesh ) చెప్పాల మాట్లాడుతూ…”పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు!! రెండు మనసులు కలవడం.” అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నాo.అన్నారుఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.

బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఫిబ్రవరి 5నుండి పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.“ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము.ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుంది.పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది.” అన్నారు హీరో సాయి రొనక్.

నటీనటులు:

సాయి రోనక్, గనవి లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి.కంచరపాలెం రాజు, సత్తన్న , తదితరులు.

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: రమేష్ చెప్పాల,నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, కెమెరామెన్: బాల్ రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి, పిఆర్ఒ: శ్రీధర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube