సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జంతువులను మనుషులు కాపాడే రెస్క్యూ వీడియోలు హాట్ టచ్ చేస్తాయి.
వీటిని చూస్తే బాగా ఎమోషనల్ అవ్వక తప్పదు.అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్( Twitter ) వేదికగా ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక సరస్సు లాంటి నీటి గుంతలో ఒక మనిషి దిగి ఏదో వెతుకుతున్నట్లు మనం చూడవచ్చు.తర్వాత అతడు ఒక అలిగేటర్ ను బయటికి తీశాడు.మొసలి లాగానే కనిపిస్తున్న ఈ జలచరం పరిమాణంలో కొంచెం చిన్నగానే ఉంది.అది కుక్క పిల్లను నోటిలో కరచుకుని కనిపించింది.అలిగేటర్ దంతాలు కుక్క( Dog ) పొట్టలో దిగిపోయాయి.దాని పట్టు నుంచి విడిపించుకోలేక కుక్క చాలా బాధను అనుభవిస్తోంది.
అయితే అలిగేటర్ కుక్క పై దాడి చేయడాన్ని గమనించిన ఒక వ్యక్తి ధైర్యం చేసి గుంతలోకి దిగాడు.
అనంతరం అలిగేటర్( Alligator ) ను చేతులతో పైకి ఎత్తాడు.ఆపై దానిని ఒడ్డు మీద పెట్టి నోటిని వెడల్పు చేశాడు.అంతే అలిగేటర్ నోటి నుంచి కుక్కకు విముక్తి కలిగింది.
అక్కడినుంచి అది బతుకు జీవుడా అంటూ పారిపోయింది.అంతటితో వీడియో ముగిసింది.
ఈ పని చేసిన వ్యక్తి కాస్త బలంగానే ఉన్నాడు.బలం ఉన్నా సరే ధైర్యం లేకపోతే ఇలాంటి పరిస్థితి నుంచి కుక్కను కాపాడటానికి ఎవరూ ముందుకు రారు.
కుక్కపిల్ల జీవితాన్ని విధికే వదిలేస్తారు.కానీ ధైర్యం చేసి వాటి ప్రాణాలను కాపాడితే అవి జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుకుంటాయి.
ఇలాంటి ధైర్యవంతులను హీరోలుగా నెటిజన్లు ఎప్పుడూ అభిమానిస్తుంటారు.వైరల్ వీడియోలోని వ్యక్తి కూడా ఒక రియల్ హీరో అని కొనియాడవచ్చు.