సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమా( okkadu movie ) సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాని మొదట గుణశేఖర్ వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట.
కానీ మృగరాజు సినిమా సమయంలో చిరంజీవి ఇచ్చిన ఒక సలహా మేరకు గుణశేఖర్ ఈ సినిమాని మహేష్ బాబుతో చేసినట్టుగా తెలుస్తుంది.అది ఏంటి అంటే మృగరాజు సినిమా షూటింగ్ చేసేటపుడు మధ్యలో బ్రేక్ సమయం దొరికినప్పుడు గుణశేఖర్ చిరంజీవి తో మాట్లాడుతూ తన తర్వాత ప్రాజెక్ట్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని రాసుకున్నానని చెప్పి అప్పుడు ఒక్కడు సినిమా కథని చిరంజీవికి చెప్పడట.
దాంతో ఈ కథకి ఎవరైతే బాగుంటారు అని గుణశేఖర్ చిరంజీవిని అడగగా ఆ కథ మొత్తం విన్న చిరంజీవి ( Chiranjeevi )అప్పుడు ఈ స్టోరీ కి మహేష్ బాబు అయితే బాగుంటాడని చెప్పడట.
ఇక అప్పుడు గుణశేఖర్( Gunasekhar ) నేను వేరే హీరోని అనుకుంటున్నాను సార్ అని చెప్పాడట.అయిన కూడా చిరంజీవి దీనికి మహేష్ బాబు అయితేనే బాగా సెట్ అవుతాడు అని చెప్పడంతో, ఆలోచన లో పడ్డ గుణశేఖర్ ఆ తర్వాత స్క్రిప్ట్ ను ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా రాసుకొని చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు మహేష్ బాబు కి కథ చెప్పి ఒప్పించి, ఈ సినిమాని మహేష్ తో చేశాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
దాంతో మహేష్ బాబు సూపర్ స్టార్ అవ్వడానికి ఒక్కడు సినిమా పునాది వేసిందనే చెప్పాలి.ఈ సంఘటన వల్లే మహేష్ బాబు సూపర్ స్టార్ అవడంలో చిరంజీవి పాత్ర చాలా ఉందని ఇండస్ట్రీ లో అందరూ చెప్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి మహేష్ ఎంట్రీ ఇస్తున్నాడు.
చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుందో…
.