టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ( Mass Maharaja Ravi Teja ) తాజాగా నటించిన చిత్రం ఈగల్( Eagle ).ఈ సినిమా ఈనెల 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
నిజానికి ఈ సినిమా గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సి ఉండగా అప్పటికే వరసగా సినిమాలో పోటీ పడుతుండడంతో ఈ సినిమా వెనక్కు తగ్గింది.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9న రాబోతున్న విషయం తెలిసిందే.
అయితే విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.కాగా ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హైప్ ఉన్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈగల్.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు.కాగా ఈ సినిమాలో రవితేజ పోషించిన ఈగల్ పాత్ర పత్తి రైతుల సమస్యల మీద పోరాడే విధంగా డిజైన్ చేశారట.అలా అని ఏదో సందేశాలు, విప్లవాలు లాంటివి లేకుండా అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే మాస్ జనాలు ఊగిపోయే ఎపిసోడ్స్ చాలానే పెట్టారని ఇన్ సైడ్ టాక్.దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ( Karthik Ghattamaneni )వాటిని తీర్చిదిద్దిన విధానం షాక్ ఇస్తుందట.
ప్రమోషన్లలో వాటిని ముందే చూపిస్తే థ్రిల్ తగ్గిపోతుంది కాబట్టి కావాలనే దాచి పెట్టినట్టు తెలిసింది.స్వయంగా రవితేజనే ఇందులో పత్తి పండించే వ్యవసాయదారుడిగా కనిపిస్తాడట.చూస్తుంటే మాస్ మహారాజా ఈసారి సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నాడు.

ధమాకా తర్వాత తనకు సోలో హిట్ పడలేదు.వాల్తేరు వీరయ్యలో పరిమిత పాత్ర కాబట్టి దాని క్రెడిట్ పూర్తిగా దక్కలేదు.రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాలు అందుకోలేదు.
ఈ ప్రభావం ఈగల్ బజ్ మీద పడటం వల్లే సోషల్ మీడియాలో ఇంకా ఫోకస్ దక్కలేదు.స్టార్ హీరోలు డ్రైగా భావించే ఫిబ్రవరి నెలను రిలీజ్ కు ఎంచుకున్న రవితేజకు మంచి ఫలితం దక్కాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తప్పనిసరి.
ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు మాస్ మహారాజా అభిమానులు.







