ఏ రంగంలో అయినా ఓవర్ నైట్ లో వచ్చిన పాపులారిటీ వల్ల కొన్నిసార్లు లాభం జరిగితే మరి కొన్నిసార్లు నష్టం కలుగుతుంది.ఈ మధ్య కాలంలో వేర్వేరు విషయాల ద్వారా కుమారి ఆంటీ( Kumari Aunty ) వార్తల్లో నిలిచారు.
దాసరి కుమారి ఫుడ్ స్టాల్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఫుడ్ స్టాల్( Food Stall ) ముందు శనివారం రోజున కొంతమంది నిరుద్యోగులు నిరసన తెలియజేయడం గమనార్హం.
అయితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరసన తెలియజేయడానికి నిరుద్యోగులు చెప్పిన కారణాలు మాత్రం వింతగా ఉన్నాయి.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వివాదం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారని మేము ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నామని మా గురించి కూడా కుమారి ఆంటీ రేవంత్ రెడ్డి చెప్పి ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు కోరారు.ఆ సమయంలో కుమారి ఆంటీ, నిరుద్యోగులతో మాట్లాడి వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.తమ ఫుడ్ స్టాల్ ముందు ధర్నాలు, నిరసనలు చేసి తమను రోడ్డున పడేయొద్దని కుమారి ఆంటీ కుటుంబ సభ్యులు కోరారు.
నిరుద్యోగులు( Unemployees ) మాత్రం నిరుద్యోగులైన మా గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పు అక్కా అంటూ కుమారి ఆంటీకి మొర పెట్టుకున్నారు.
నిరుద్యోగుల నిరసన( Unemployees Protest ) వల్ల కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర కొంత సమయం పాటు ట్రాఫిక్ జామ్ అయింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కుమారి ఆంటీ వచ్చిన పాపులారిటీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అందరి దృష్టి ఆమెపై ఉండటంతో వివాదాలకు తావివ్వకుండా ఆమె మెలగాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కుమారి ఆంటీకి నెటిజన్ల సపోర్ట్ ఉండటం ఆమెకు ప్లస్ అవుతోంది.