Priyanka Jain: అందుకే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నాం.. ప్రియాంక జైన్ కామెంట్స్ వైరల్

బుల్లితెర నటీనటులుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శివకుమార్ ( Shiva Kumar ) ప్రియాంక జైన్ ( Priyanka Jain ) ఒకరు వీరిద్దరూ కలిసి మౌనరాగం సీరియల్ లో నటించారు ఈ సీరియల్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ బుల్లితెర సీరియల్స్ నటిస్తున్నారు.

 Priyanaka Shivakumar Explain Their Living Relation-TeluguStop.com

ఇకపోతే ఇటీవల ప్రియాంక బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లిన సంగతి తెలిసిందే.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివ హౌస్ లోకి వెళ్లగా ప్రియాంక తనని హగ్ చేసుకుని ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం అంటూ చెప్పారు కానీ ఆయన బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందామని చెప్పారు.

Telugu Bigg Boss, Priyanaka, Shivakumar-Movie

ఇక బిగ్ బాస్ పూర్తి అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉండడంతో మీ పెళ్లి ఎప్పుడు అంటూ తరచూ అభిమానుల నుంచి ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రశ్నకు ప్రియాంక ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ సమాధానం చెప్పారు.ఇకపోతే వీరిద్దరూ పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదే విషయం గురించి అభిమానులు వీరిని ప్రశ్నించారు.పెళ్లి కాకుండా ఇలా సహజీవనం చేయడం ఏంటి అని ఇలా చేయడానికి మీ పెద్దలు అడ్డు చెప్పలేదా అంటూ ప్రశ్నించారు.

Telugu Bigg Boss, Priyanaka, Shivakumar-Movie

మేము పెద్దల అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నామని శివకుమార్ వెల్లడించారు.ఇక ప్రియాంకకు ఎక్కువ రోజులు ఘనంగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది.అలా పెళ్లి చేసుకోవాలి అంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.

అందుకే మేము సహజీవనం చేస్తున్నాము అంటూ ఈయన వింత సమాధానం చెప్పారు.ఇక పెళ్లికి ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నామని తెలిపారు.

ఇలా సహజీవనం గురించి శివకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube