టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీలలో దగ్గుబాటి ఫ్యామిలీ ( Daggubati family )ఒకటి.ఈ కుటుంబం నుంచి డి.
రామానాయుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టి విజయవంతమైన నిర్మాతగా వెలుగొందాడు.రామానాయుడు 1964లో ప్రారంభించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా అవతరించింది.
రామానాయుడు 13 భారతీయ భాషలలో 150 కంటే ఎక్కువ సినిమాతో అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు కూడా ఎక్కాడు.ఇక అతని కుమారుడు సురేష్ బాబు సైతం నిర్మాతగా రాణించాడు.
ఇంకొక కుమారుడు విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకటిగా నిలిచాడు.టాలీవుడ్ సినిమాకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మూడు పిల్లర్లు, అయితే నాలుగో పిల్లర్ గా వెంకటేష్ నిలిచాడు.

అయితే వెంకటేష్( Venkatesh ) తర్వాత దగ్గుబాటి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రానా అడుగుపెట్టాడు.వెంకీ వలె రానా కూడా బాగా సక్సెస్ అవుతాడు అనుకున్నారు కానీ అతని కెరీర్ చాలా ఫ్లాపులతో పతనమయింది.రానా( Rana ) సురేష్ బాబు కి కుమారుడు అవుతాడు.ఈ యంగ్ హీరో లీడర్, నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు కానీ అవి ఏమీ అతడికి స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి.
వీటి తర్వాత అతడు బాహుబలి సినిమాలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న భల్లాల దేవ పాత్ర పోషించాడు.రుద్రమదేవి సినిమాలో కూడా ఒక సైడ్ క్యారెక్టర్ చేశాడు.

హీరోగా కాకుండా ఇలా వేరే క్యారెక్టర్లు సినిమాల్లో చేయడం వల్లే అతడు స్టార్ హీరోగా నిలబడలేక పోవడానికి కారణమని చాలామంది చెబుతుంటారు.నిజానికి బాహుబలిలో భల్లాలదేవ క్యారెక్టర్ చేయడం వల్ల రానాకి మంచి పేరు వచ్చింది.హీరోగా అతడు చేసిన సినిమాలకు పెద్దగా పేరు రాలేదు.నిజానికి ఒకానొక సందర్భంలో రానానే హీరో కంటే మంచి క్యారెక్టర్స్ చేయడమే తనకు ఇష్టమని చెప్పాడు.స్టార్ హీరో ఇమేజ్ రాకపోయినా తనకు బాధ ఏం లేదని కూడా పేర్కొన్నాడు.భీమ్లా నాయక్ సినిమాలో సైతం రానా మామూలు పాత్ర చేశాడు.
ఇలాంటి మంచి రోజులు యాక్సెప్ట్ చేస్తూనే విరాటపర్వం వంటి సినిమాల్లో హీరోగా కనిపించాడు కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.ఒకవేళ హీరో గా ఆన్సర్ చేసిన సినిమా మంచి హిట్ అయితే స్టార్ హీరో ఇమేజ్ అతడికి రావడం ఖాయం.