Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్ లాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టం.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది నవంబర్లో మెగా హీరో వరుణ్ తేజ్ ని( Varun Tej ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Miss Perfect Lavanya Tripathi And Abhijeet Duddalas Webseries Released Disney P-TeluguStop.com

వీరిద్దరిదీ ప్రేమ వివాహం అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా పెళ్లి తర్వాత లావణ్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ మిస్‌ పర్ఫెక్ట్‌.( Miss Perfect ) తాజాగా శుక్రవారం నుంచి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.

Telugu Abhijeet, Disney Hot, Lavanyatripathi, Perfect, Factory, Tollywood, Varun

రొమాన్స్‌, కామెడీ కలబోసిన కథ ఇది.ఈ సిరీస్‌లో నేను మిస్‌ లావణ్య, లక్ష్మి అనే క్యారెక్టర్స్‌లో నటించాను.తను ఒక పర్‌ఫెక్షనిస్ట్‌.

ప్రతి పనిలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి.నా పాత్ర ఎమోషన్స్‌తో ( Emotional Role ) సాగుతుంది అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

తన వ్యక్తిగత జీవితానికి ఈ రెండు పాత్రలు చాలా దగ్గరగా ఉంటాయని, ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మిలా, సెట్‌లో మాత్రం లావణ్య క్యారెక్టర్‌లా పర్‌ఫెక్షన్‌ కోరుకుంటానని తెలిపారు.ఈ సిరీస్‌ వరుణ్‌తేజ్‌కు కూడా బాగా నచ్చింది.

దీని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ కూడా చేసాడు.వరుణ్ తేజ్ లాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం అని లావణ్య త్రిపాఠి తెలిపింది.

Telugu Abhijeet, Disney Hot, Lavanyatripathi, Perfect, Factory, Tollywood, Varun

నేను గతంలో థ్రిల్లర్‌, యాక్షన్‌ సిరీస్‌లు చేశాను.దాంతో ఇప్పుడు రొమాంటిక్‌ కామెడీ( Romantic Comedy ) చేయడం చాలా ఈజీగా అనిపించింది.సినిమాల విషయంలో నేను సెలెక్టివ్‌గా ఉంటాను.తక్కువ సినిమాలు చేసినా నటిగా గుర్తుండిపోవాలనుకుంటాను.ప్రస్తుతం ఒక కొత్త హీరోతో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో సినిమా పూర్తి చేశాను.అందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాను.

మరో తమిళ సినిమా చేస్తున్నాను అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.ఈ మేరకు లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube