తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందన్నారు.
కాంగ్రెస్ 40 స్థానాలను కూడా నిలబెట్టుకునే అవకాశం లేదన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ( Mamata Banerjee ) వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు.కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహారిస్తోందని విమర్శించారు.మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నేతలే దేశంలో బీజేపీ( BJP )ని అడ్డుకోగలరని తెలిపారు.
బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.







