విశాఖ జిల్లా( Visakha )లో అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణం తీవ్ర కలకలం సృష్టించింది.చినగదిలి రూరల్ ఎమ్మార్వో రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు.
అర్థరాత్రి సమయంలో చరణ్ క్యాస్టల్ అపార్ట్ మెంట్ వద్ద ఎమ్మార్వో రమణయ్య( MRO Ramanaiah )పై గుర్తు తెలియని వ్యక్తి రాడ్ తో దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది.తీవ్ర గాయాలపాలైన రమణయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటనా స్థలాన్ని విశాఖ సీపీ రవి శంకర్ పరిశీలించారు.

మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసిన సీపీ నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ( DCP Manikanta ) ఆధ్వర్యంలో అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.
అయితే ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి ఎమ్మార్వో రమణయ్య బదిలీ అయ్యారు.కాగా హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.







