హిట్టైన ప్రతి సినిమాకు సంబంధించి ప్రేక్షకుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.కొందరు ఆ విషయాలను సమర్థిస్తే మరి కొందరు మాత్రం నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.
అయితే బాహుబలి( Baahubali ), కబీర్ సింగ్, యానిమల్ సినిమాల గురించి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే కిరణ్ రావు చేసిన కామెంట్లకు సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
బాహుబలి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు( Animal ) స్త్రీల విషయంలో ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కిరణ్ రావు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

కిరణ్ రావు( Aamir Khan Ex Wife Kiran Rao ) పేరు ప్రస్తావించకుండానే సందీప్ రెడ్డి వంగా రియాక్ట్ అయ్యారు.కిరణ్ రావు అన్న వ్యాఖ్యలు నేను విన్నానని ఆమెకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నానని ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ దగ్గరకు వెళ్లి దిల్ సినిమాలో హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించే సీన్ గురించి అడగాలని పేర్కొన్నారు.ఆ సినిమాలో హీరో ఆమె తప్పు చేసిందని నమ్మిస్తాడని చివరకు ఆ అమ్మాయి హీరోనే ప్రేమిస్తుందని మరి ఇదంతా ఏంటని కామెంట్లు చేశారు.
ఇలాంటివి తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు.సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ కామెంట్ల గురించి ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమాలు ప్రభాస్, బన్నీ హీరోలుగా తెరకెక్కుతున్నాయి.ఈ సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.స్పిరిట్ సినిమా( Spirit ) షూట్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.







