11 రోజుల్లో అయోధ్య బాలరాముడిని అన్ని లక్షల మంది భక్తులు దర్శించుకున్నారా.. రికార్డ్ అంటూ?

అయోధ్య బాలరాముడిని( Ayodhya Balaramudu ) దర్శించుకోవాలని కోరుకుంటున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు.

 25 Lakhs Devotees Visited Ram Temple In 11 Days Details Here Goes Viral ,balara-TeluguStop.com

గత నెల 22వ తేదీన రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగగా రోజుకు 2 లక్షల కంటే ఎక్కువమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారని సమాచారం అందుతోంది.భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దర్శన వేళ్లల్లో సైతం మార్పులు చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో కూడా ఈ ఆలయానికి భారీ మొత్తంలో విరాళాలు వస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటివరకు అయోధ్య రామాలయానికి 11 కోట్ల రూపాయల విరాళం( 11 Crores Donation ) వచ్చిందని ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో మాత్రం 8 కోట్ల రూపాయలు జమైందని తెలుస్తోంది.

అయోధ్యకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా మరో నాలుగు నెలల వరకు టికెట్లు అందుబాటులో లేవు.

Telugu Ayodhya, Ayodhya Mandir, Balaramudu, Devotees-Latest News - Telugu

అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు( Ayodhya Devotees ) క్యూ కడుతుండగా చెక్కుల రూపంలో 3.5 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం అందుతోంది.ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాలరాముడిని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది.

విదేశాల నుంచి కూడా ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.హుండీ ఆదాయం లెక్కింపు సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతోందని తెలుస్తోంది.

Telugu Ayodhya, Ayodhya Mandir, Balaramudu, Devotees-Latest News - Telugu

అయోధ్య బాలరాముడికి సంబంధించిన విషయాలు, విశేషాలు సోషల్ మీడియా( Social Media ) వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.బాల రాముడి దర్శనమార్గంలో మొత్తం 4 హుండీలను ఏర్పాటు చేశారు.ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి విరామం లేకుండా భక్తులు బాలరాముడిని దర్శించుకునే అవకాశం అయితే ఉంది.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయోధ్య రాముడిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube