వారానికి ఒకసారి ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడారంటే 60 లోనూ మీ జుట్టు నల్లగానే ఉంటుంది!

వయసు పైబడే కొద్ది జుట్టులో మెలనిన్( Melanin ) ఉత్పత్తి తగ్గుతూ వ‌స్తుంది.దాంతో క్రమంగా జుట్టు తెల్ల పడటం ప్రారంభం అవుతుంది.

 This Magical Oil Helps To Keep Your Hair Black Even At 60s! Black Hair, Magical-TeluguStop.com

తెల్ల జుట్టును చాలా మంది ఇష్టపడరు.వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతూ నానా తిప్పలు పడుతుంటారు.

అయితే తెల్ల జుట్టు వచ్చాక ఇబ్బంది పడేక‌న్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వారానికి కేవలం ఒక్కసారి వాడిన చాలు.60 లోనూ మీ జుట్టు నల్లగానే ఉంటుంది.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Magical Oil, White-Telugu Health

ముందుగా మూడు నుంచి నాలుగు ఉసిరికాయ( Amla )లను తీసుకొని గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే నాలుగు రెబ్బలు కరివేపాకు, నాలుగు మందారం ఆకులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు ఆవ నూనె( Mustard oil ) వేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Magical Oil, White-Telugu Health

ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఉడికించాలి.చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న ఆయిల్ ను పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఇక‌ ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలిక పాటి స్నానం చేయాలి.

ఈ మ్యాజికల్ ఆయిల్ ను వారానికి ఒకసారి వాడిన బోలెడు ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ నూనె జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడుతుంది.

తెల్ల జుట్టు త్వరగా దరి చేరకుండా అడ్డుకుంటుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube