సినిమా ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలు కేవలం మూవీస్ నుంచి మాత్రమే కాదు బ్రాండ్ ప్రమోషన్లు, షాపు ఓపెనింగ్స్, కమర్షియల్ యాడ్స్, సోషల్ మీడియా ద్వారా చాలా డబ్బులను సంపాదిస్తుంటారు.మహేష్ బాబు లాంటి వారు వ్యాపారాలు కూడా ప్రారంభించి వివిధ మార్గాల్లో కోట్లు సంపాదిస్తున్నారు.
నటనలోనే కాదు డబ్బు సంపాదించడంలోనూ తమ ముందుంటామని వారు చెప్పకనే చెబుతున్నారు.కొంతమందికి ఒక సైడ్ జాబుగా ప్రకటనలో నటించడాన్ని ఇష్టపడుతుంటారు.
ఇక సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తుంటారు.కొంతమందికి ఇదొక ఇన్కమ్ సోర్స్ అయితే మరి కొంతమందికి ఇది ఒక హాబీ లాగా ఉంటుంది.
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో కూడా ఇలానే డబ్బు సంపాదించేవారు ఉన్నారు.వీరు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు వెనకేస్తున్నారు.వాళ్ళు పెట్టే ఒక్కొక్క పోస్టు లక్షల్లో వ్యూస్ లైక్స్ పొందుతుంటాయి.అందుకే కంపెనీలు వీరి ద్వారా తమ ఉత్పత్తులను, సేవలను ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడుతుంటాయి.
ప్రమోషన్లు చేసినందుకు లక్షల నుంచి కోట్లలో కూడా డబ్బులు ఇస్తుంటాయి.ఇలా డబ్బు సంపాదించే టాలీవుడ్ సెలబ్రిటీలలో సమంత నుంచి విజయ్ దేవరకొండ వరకు చాలామంది ఉన్నారు వారు ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ కు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
* సమంత ( samantha )
ఓ బేబీ, దూకుడు, ఈగ, రంగస్థలం, సెవెంత్ సెన్స్ ఆ వంటి సినిమాలతో అగ్రతారగా ఎదిగిన సమంతకు ఇన్‌స్టాలో 3 కోట్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.అయితే ఆమె కంపెనీలకు సంబంధించి పెట్టే ఒక్క పోస్టుకు రూ.50 నుంచి 70 లక్షల వరకు వసూలు చేస్తుందట.
• రష్మిక ( rashmika )

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఇన్‌స్టాలో 4 కోట్ల 14 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.కానీ ఆమె సమంత కంటే తక్కువగానే చార్జ్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మ నెలకు 30 నుంచి 50 లక్షల వరకు సోషల్ మీడియా పోస్టుల ద్వారా సంపాదిస్తుందని సమాచారం.
• కాజల్ అగర్వాల్( Kajal Aggarwal )

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినిమాల్లో కంటే బ్రాండ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడంలోనే ఎక్కువ బిజీగా ఉంటుంది.ఈ తార నెలకు ఇన్‌స్టా ప్రమోషన్ల ద్వారా 50 లక్షలు సంపాదిస్తుందని టాక్.పెళ్లి కొడుకు పుట్టిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తూ డబ్బులు వెనకేస్తోంది.
• విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )
రౌడీ హీరోగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
అందుకే ఈ హీరో కి కూడా బాగానే వాల్యూ ఉంది.ఆ క్రేజ్‌ను బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు విజయ్.ఈ హ్యాండ్సమ్ ఒక్క ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తే ఏకంగా కోటి రూపాయలు తీసుకుంటాడట.ఇక మహేష్ బాబు సోషల్ మీడియా సంపాదన కూడా నెలకు కోట్లలో ఉంటుందని సమాచారం.