మీ శరీరానికి సరిపడా నీరు అందుతుందో లేదో.. ఇలా తెలుసుకోండి..!

తగినంత నీరు తాగడం వల్ల మీ దాహం తీరుతుంది.మీ శరీరం ద్రావ సమతుల్యతను కాపాడుతుంది.

 Check If Your Body Getting Enough Water Or Not Like This Details, Body ,enough-TeluguStop.com

కేలరీలను నియంత్రించడం, అవయవాలను సక్రమంగా పనిచేయించేలా చేయడం,శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం, టాక్సిన్‌లను తొలగించడం ఇలా ఎన్నో పనులను నీరు( Water ) చేస్తుంది.ప్రతి రోజు కనీసం నాలుగు లీటర్ల నీటిని తగలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే మనిషి శరీరాన్ని బట్టి ఇది భిన్నంగా ఉంటుంది.కాబట్టి అవసరమైన హైడ్రేషన్( Hydration ) మీకు లభిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? తగినంత నీరు శరీరానికి అందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.మరి ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Skin, Urine Color, Quantity-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే మీ శరీరానికి తగినంత నీరు సరిపోతుందా లేదా అనేది మీ మూత్రం రంగు పై( Urine Color ) ఆధారపడి ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ముదురు పసుపు లేదా కాషాయం రంగులు నిర్జలీకరణాన్ని సూచిస్తాయి.అయితే లేత పసుపు లేదా గడ్డి రంగులు బాగా హైడ్రేట్ శరీరాన్ని సూచిస్తాయి.

కాబట్టి మీరు సరైన హైడ్రేషన్ స్థాయిలను స్థిరంగా నిర్వహిస్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి రోజంతా మీ మూత్రం పై నిఘా ఉంచాలి.మీరు తరుచుగా యూరిన్ కి వెళ్తుంటే మీ శరీరం హైడ్రేట్‌ గా ఉందని అర్థం చేసుకోవచ్చు.

Telugu Tips, Skin, Urine Color, Quantity-Telugu Health

మీరు అరుదుగా మూత్రనికి వెళుతూ ఉంటే తగినంత నీరు( Enough Water ) తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.చాలామంది దాహం వేస్తేనే మంచినీళ్లు తాగుతూ ఉంటారు.అలా కాకుండా గంటకు ఒక్కసారైనా నీటిని తాగుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి.దీని వల్ల హైడ్రేట్‌ గా ఉంటారు.మీ శరీరానికి తగినంత మీరు అందుతుందో లేదో చెప్పేందుకు చర్మం( Skin ) కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.మీ చర్మం కాంతివంతంగా ఉంటే మీరు హైడ్రేట్ గా ఉన్నారని అర్థం చేసుకోవాలి.

మీ చర్మం నిర్జీవంగా, డల్ గా ఉంటే తగినంత నీరు తాగడం లేదని అర్థం చేసుకోవాలి.ఆకస్మిక బరువులో మార్పులు కూడా మీ హైడ్రేషన్ స్థాయిలలో హెచ్చు తగ్గులను సూచిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube