ఏపీలో ఎన్నికలు( AP elections ) సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించింది.ఈ మేరకు అభ్యర్థుల ఖరారుపై హైదరాబాద్ లో పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.క్షేత్రస్థాయి నుంచి టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది.
జనసేన – టీడీపీ పొత్తు( Janasena TDP Alliance ) నేపథ్యంలో జనసేన ఆశిస్తున్న సీట్లపై క్లారిటీ రావడం లేదు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు మాత్రం సీట్ల వ్యవహారంపై చంద్రబాబు భరోసా ఇచ్చారని సమాచారం.మరోవైపు ఎంపీ టికెట్ల విషయంలో టీడీపీ కసరత్తు చివరి దశకు రాగా. వైసీపీ ఎమ్మెల్యేల చేరికలు ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తుందని తెలుస్తోంది.